రచన : త్యాగరాయ కీర్తన
సంగీతం : ఇళయరాజా
గానం : ఎస్.జానకి
Photo:ఎస్.జానకి
పల్లవి :
సుజన పరిపాల కనకమయ చేల
సుజన పరిపాల కనకమయ చేల
సుజన పరిపాల
శ్రీరమాలోల విద్ధృత శరజాల
శుభద కరుణాలవాల ఘననీల
నవ్య వనమాలికాభరణ
ఏలా... నీ... దయా... రాదూ...
పరాకు చేసేవేలా సమయము కాదూ
చరణం :
రారా రారా రారా రారా దేవాదిదేవా
రారా మహానుభావా
రారా దేవాదిదేవా
రారా మహానుభావా (2)
రారా రాజీవ నేత్ర రఘువంశ పుత్రా
సారతర సుధా పూర హృదయ
రారా... రారా...
సారతర సుధా పూర హృదయ
పరివార జలధి గంభీర
దనుజ సంహార
దశరథ కుమార బుధజన విహార
సకల శ్రుతిసార నాదుపై
ఏలా నీ దయా రాదూ
సా రీమ రిస తక తఝుం
దప మప దప ఝుం
సనిరిస తక తఝుం
సనిస థీం సనిసరిస ధీం
సనిసగా మరీ సనిరిస ధీం
పద తకధిమి తక తఝుం
పపమరి మమరిస
సరిరిమ రిమమప తకఝుం
పమగమరీ మరిస
రిమప తద్ధీంగిణతో
నిపమ తద్ధీంగిణతో
ఏలా నీ... దయా... రాదూ...
పరాకు చేసేవేలా సమయము కాదూ
ఆ... ఏలా... నీ... దయా... రాదూ...