Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

పల్లవి :
గాలికి కులమేదీ... (2)
ఏదీ... నేలకు కులమేదీ...

మింటికి మరుగేదీ ఏదీ... (2)
కాంతికి నెలవేదీ

చరణం : 1
పాలకు ఒకటే... ఆ...
పాలకు ఒకటే తెలి వర్ణం
ఏదీ ప్రతిభకు కలదా ఫలభేదం
వీరులకెందుకు కులభేదం
అది మనసుల చీల్చెడు మతభేదం

చరణం : 2
జగమున యశమే...
జగమున యశమే మిగులునులే
అదీ యుగములకైనా చెదరదులే
దైవం నీలో నిలుచునులే
ధర్మం నీతో నడుచునులే (2)

చిత్రం : కర్ణ (1964)
రచన : డా॥సి.నారాయణరెడ్డి
సంగీతం : విశ్వనాథన్-రామ్మూర్తి
గానం : పి.సుశీల

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |