Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |
Showing posts with label tollywood. Show all posts
Showing posts with label tollywood. Show all posts

చిత్రం : పెళ్లినాటి ప్రమాణాలు (peLlinATi pramANAlu) (1958)
రచన : పింగళి నాగేంద్రరావు (pi~mgaLi nAgendrarAo)
సంగీతం, గానం : ఘంటసాల (ghanTasAla)

challaga chooDAli - చల్లగ చూడాలి




సాకీ :
కావనగానే సరియా
ఈ పూవులు నీవేగా దేవీ
పల్లవి :
చల్లగ చూడాలి
పూలను అందుకు పోవాలి దేవీ
చల్లగ చూడాలి
పూలను అందుకు పోవాలి
అనుపల్లవి :
మల్లె సుగంధం మనసున జల్లి
మళ్లీ అల్లరి తగునా॥
చరణం : 1
మలయానిలముల లాలన వలెనే
వలపులు హాయిగ కురిసి...॥
కలికి చూపులను చెలిమిని విడిచి
చిలిపిగ దాగుట న్యాయమా॥
చరణం : 2
తెలిమబ్బులలో జాబిలి వలెనే
కళకళలాడుచు నిలిచి...॥
జిలిబిలి సిగ్గుల పిలువక పిలిచి
పలుకకపోవుట న్యాయమా॥
Listen :


Special Note:
ఘంటసాల తండ్రి సూరయ్యగారు మృదంగం వాయించేవారు. ఆయనకు సంగీతమంటే ప్రాణం. ఆయన ఘంటసాలను తనతోపాటు ఎక్కడకు తీసుకువెడుతున్నా, దారిపొడవునా ఎన్నో కబుర్లు చెప్పేవారు. ‘‘నాయనా! సంగీతకళ చాలామహత్తరమైంది. ఆ కళలో తరించే అవకాశం రావడం మన అదృష్టం. నువ్వు బాగా సంగీతం నేర్చుకుని పైకి రావాలి’’ అని తరచు చెప్పేవారు సూరయ్య. ఆయన వాక్కు నిజమయ్యింది. ఎన్నటికీ ఎవ్వరూ మరువలేని గొప్ప గాయకుడు అయ్యారు ఘంటసాల. అంతా తండ్రిగారి ఆశీర్వాదం.

చిత్రం : చిరునవ్వుతో(chirunavvutO)... (2000)
రచన : సిరివెన్నెల(sirivennela)
సంగీతం : మణిశర్మ(maNiSarma)
గానం : బాలు(S.P.bAlu)


పల్లవి : సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా
ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మా
నవ్వే నీ కళ్లలో లేదా ఆ జాబిలి
నవ్వే ముంగిళ్లలో రోజూ దీపావళి...
ఓ... హో... ॥సంతోషం॥
చరణం : 1
నిన్నటి నీడలే కనుపాపని ఆపితే
రేపటి వైపుగా నీ చూపు సాగదుగా॥ నిన్నటి ॥
చుట్టమల్లే కష్టమొస్తే
కళ్లనీళ్లు పెట్టుకుంటూ
కాళ్లు కడిగి స్వాగతించకూ
ఒక్క చిన్న నవ్వు నవ్వి
సాగనంపకుండా లేనిపోని సేవచేయకు
మిణుగురులా మిలమిల మెరిసే
దరహాసం చాలు కదా
ముసురుకునే నిశి విలవిలలాడుతూ
పరుగులు తియ్యదా ॥ నవ్వే॥
చరణం : 2
ఆశలు రేపినా అడియాశలు చూపినా
సాగే జీవితం అడుగైనా ఆగదుగా॥ఆశలు ॥
నిన్న రాత్రి పీడకల
నేడు తలచుకుంటూ
నిద్రమానుకోగలమా
ఎంత మంచి స్వప్నమైనా
అందులోనే ఉంటూ
లేవకుండా ఉండగలమా
కలలుగన్నవి కలలే అని
తెలిసినదే తెలివమ్మా
కలతలని నీ కిలకిలతో
తరిమెయ్యవే చిలకమ్మా
॥నవ్వే॥ ॥ సంతోషం ॥

చిత్రం : మల్లీశ్వరి(mallISwavari) (1951)
రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి(dEvulapalli krishnaSAstri)
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు(sAlUri rAjEswararao)
గానం : భానుమతి(bhAnumati)


పల్లవి :
కోతిబావకు పెళ్లంట
కోవెల తోట విడిదంట (2)॥
చరణం : 1
మల్లీ మాలతి వస్తారా
మాలికలల్లి తెస్తారా
బంతి జాజి చేమంతి
బంతులుకట్టి తెస్తారా (2)
పెళ్లికి మీరు వస్తారా
పేరంటానికి వస్తారా
పందిరి వేస్తాము
ముందర ముగ్గులు పెడతాము
పందిరి కింద
పెళ్లివారికి విందులు చేస్తాము
మంచి విందులు చేస్తాము
బాకా బాజా డోలు సన్నాయ్ (3)
మేళాలెడతారు...
తప్పెటతాళాలెడతారు (2)॥
చరణం : 2
అందాల మా బావగారికి
గంధాలు పూసి... ఓ...
గారాల మా బావ మెడలో
హారాలు వేసి
కుళ్లాయెడతాము
కుచ్చుల తురాయి పెడతాము
హారాలేసి గంధం పూసి
కుళ్లాయెట్టి తురాయి పెడతాము
కుచ్చుల తురాయి పెడతాము
ఓ... పల్లకి ఎక్కి
పల్లకి ఎక్కి కోతి బావ పళ్లికిలిస్తాడు
బావ పళ్లికిలిస్తాడు
మా కోతి బావ పళ్లికిలిస్తాడు॥

చిత్రం : ఎం.ఎల్.ఎ.(M.L.A) (1957)
రచన : ఆరుద్ర(Arudra)
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు(penDyAla nAgEswararAo)
గానం : పి.సుశీల, మాధవపెద్ది సత్యం, బృందం(P.suseela,madhavapeddi satyam,troop)
30 January - నేడు గాంధీజీ వర్ధంతి


పల్లవి :
నమో నమో బాపూ...
మాకు న్యాయమార్గమే చూపు (2)॥నమో॥
చరణం : 1
నిరంతరం మా హృదంతరంలో
నిండి వెలుగుజ్యోతి
నిత్యసత్యకాంతి॥నమో॥
చరణం : 2
ధర్మదేవత నాల్గుపాదములు
బ్రహ్మదేవుని నాల్గువేదములు
ధర్మభూమిలో మరల నిలిపి... ఆ...
నిర్మల బోధలు చేసిన బాపూ॥నమో॥
చరణం : 3
నీవు తీసిన బాటలు దాటి
నీతిని విడచి నిన్నే మరచి (2)
నీ అనుచరులే మారెదరేమో...
ఓ... ఓ... ఓ...
నీ అనుచరులే మారెదరేమో
నిదురనుండి లేపూ... బాపూ...॥నమో॥
చరణం : 4
ఆశయాలకై అశువుల బాసిన
అమరమూర్తివయ్యా
నీవు ఆత్మబలముతో ఆదర్శాలు
అవనిలోన నిలుపు బాపూ...॥నమో॥
బాపూ....

చిత్రం : అన్నమయ్య(annamayya) (1997)
రచన : వేటూరి(vETUri)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి(M.M.keeravANi)
గానం : బాలు, సుజాత, రేణుక(bAlu,sujAta,rENuka)
29 January - నేడు వేటూరి సుందరరామమూర్తి జయంతి




పల్లవి :
తెలుగుపదానికి జన్మదినం
ఇది జానపదానికి జ్ఞానపథం
ఏడుస్వరాలే ఏడుకొండలై
వెలసిన కలియుగ విష్ణుపదం
అన్నమయ్య జననం...
ఇది అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం...
చరణం : 1
అరిషడ్వర్గము తెగనరికే
హరిఖడ్గమ్మిది నందకము
బ్రహ్మలోకమున బ్రహ్మాభారతి
నాదాశీస్సులు పొందినదై
శివలోకమున చిద్విలాసమున
ఢమరుధ్వనిలో గమకితమై
దివ్యసభలలో
నవ్యలాస్యముల
పూబంతుల చేబంతిగ ఎగసి
నీరదమండల నారదతుంబుర
మహతీగానపు మహిమలు తెలిసి
సితహిమకంథర యతిరాట్‌సభలో
తపఃఫలమ్ముగ తళుకుమని
తల్లి తనముకై తల్లడిల్లు
ఆ లక్కమాంబ గర్భాలయమ్ములో
ప్రవేశించె ఆ నందకము
నందనానందకారకము॥జననం॥
చరణం : 2
పద్మావతియే పురుడుపోయగా
పద్మాసనుడే ఉసురు పోయగా
విష్ణుతేజమై నాదబీజమై
ఆంధ్రసాహితీ అమరకోశమై
అవతరించెను అన్నమయ
అసతోమా సద్గమయ (2)
చరణం : 3
పాపడుగా నట్టింట పాకుతూ
భాగవతము చేపట్టెనయా
హరినామమ్మును ఆలకించక
అరముద్దలనే ముట్టడయా
తెలుగుభారతికి వెలుగు హారతై
ఎదలయలో
పదకవితలు వెలయ
తాళ్లపాకలో ఎదిగె అన్నమయ
తమసోమా జ్యోతిర్గమయ
తమసోమా జ్యోతిర్గమయ... (2)


Special Note:
పూర్తిపేరు : వేటూరి సుందరరామమూర్తి
జననం : 29-01-1936
జన్మస్థలం : కృష్ణాజిల్లా దివితాలుకాలోని పెదకళ్లేపల్లి గ్రామం
తల్లిదండ్రులు : వేటూరి చంద్రశేఖరశాస్త్రి-కమలాంబ
తోబుట్టువులు : తమ్ముడు సదానందమూర్తి
విద్యార్హత : బి.ఎ.
వివాహం-భార్య:7-5-1960, సీతామహాలక్ష్మి
సంతానం : ముగ్గురు పిల్లలు (రవిప్రకాష్, చంద్రశేఖర్, నందకిషోర్ )
రచయితగా తొలిచిత్రం-పాట-పారితోషకం : ఓ సీతకథ (1974) - భారతనారీ చరితము - మూడు వందల రూపాయలు
ఇప్పటివరకు రికార్డింగ్ జరిగిన ఆఖరి పాట : ఓంకారేశ్వరి... (చిత్రం : బద్రీనాథ్-2011)
రాసిన మొత్తం పాటలు-చిత్రాలు : ఐదు వేలకు పైగా పాటలు రాశారు. దాదాపు రెండు వేల చిత్రాలకు.
గౌరవ-పురస్కారాలు : నంది, కళాసాగర,మనస్విని, సితార, మరెన్నో సినీ అవార్డులు, ‘మాతృదేవోభవ’ చిత్రానికి జాతీయ అవార్డు, నాగార్జున యూనివర్సిటీ నుండి డాక్టరేట్ గౌరవం అందుకున్నారు.
మరణం : 22-05-2010

చిత్రం : మరణ మృదంగం(maraNa mruda~mgam) (1988)
రచన : వేటూరి(vETUri)
సంగీతం : ఇళయరాజా (ilayarAjA)
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల(S.P.bAlu,P.suSeela)


పల్లవి :
కరిగిపోయాను కర్పూర వీణలా
కలిసిపోయాను నీ వంశధారలా
నా గుట్టు జారిపోతున్నా
నీ పట్టు చిక్కిపోతున్నా
నీ తీగ వణికిపోతున్నా
రాగాలు దోచుకొంటున్నా
కురిసిపోయింది ఓ సందె వెన్నెల
కలిసిపోయాక ఈ రెండు కన్నులా
చరణం : 1
మనసు పడిన కథ తెలుసుగా
ప్రేమిస్తున్నా తొలిగా
పడుచు తపన ఇది తెలుసుగా
మన్నిస్తున్నా చెలిగా
ఏ ఆశలో ఒకే ధ్యాసగా
ఏ ఊసులో ఇలా బాసగా
అనురాగాలనే బంధాలనే
పండించుకో మరీ తపించగా
కరిగిపోయాను కర్పూర వీణలా
కురిసిపోయింది ఓ సందె వెన్నెల
॥గుట్టు॥॥తీగ॥॥॥
చరణం : 2
అసలు మతులు చెడి జంటగా
ఏమౌతామో తెలుసా
జతలు కలిసి మనమొంటిగా
ఏమైనా సరి గరిసా
ఏ కోరికో శ్రుతే మించగా
ఈ ప్రేమలో ఇలా ముంచగా
అధరాలెందుకో అందాలలో
నీ ప్రేమలేఖలే లిఖించగా
కురిసిపోయింది ఓ సందె వెన్నెల
కలిసిపోయాను నీ వంశధారలా
॥తీగ॥॥గుట్టు॥॥॥

పల్లవి :
చిత్రం : సీతామాలక్ష్మి(sItAmAlakshmi) (1978)
రచన : వేటూరి(vEtUri)
సంగీతం : కె.వి.మహదేవన్(K.V.MahadEvan)
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల(S.P.bAlu,P.suSIla)


సీతాలు సింగారం
మాలచ్చి బంగారం
సీతామాలచ్చిమంటే
శ్రీలచ్చిమవతారం॥
మనసున్న మందారం
మనిషంతా బంగారం
బంగారు కొండయ్యంటే
భగవంతుడవతారం॥॥
చరణం : 1
పూసంత నవ్విందంటే
పున్నమి కావాలా
అయితే నవ్వనులే...
కాసంత చూసిందంటే
కడలే పొంగాలా
ఇక చూడలేను...
పూసంత నవ్విందంటే
పున్నమి కావాలా
కాసంత చూసిందంటే
కడలే పొంగాలా
ఎండి తెరమీద పుత్తడిబొమ్మ
ఎలగాలా ఎదగాలా
ఆ ఎదుగూ ఒదుగూ యెలుగూ
కన్నుల యెన్నెల కాయాలా
నువ్వంటుంటే
నే వింటుంటే
నూరేళ్లు నిండాలా ॥
చరణం : 2
దాగుడుమూతలు
ఆడావంటే దగ్గరకే రాను
అయితే నేనే వస్తాలే...
చక్కలిగింతలు పెట్టావంటే
చుక్కయిపోతాను
ఎగిరొస్తాలే...
దాగుడుమూతలు ఆడావంటే
దగ్గరకే రాను
చక్కలిగింతలు పెట్టావంటే
చుక్కయిపోతాను
గుండె గుడిలోన దివ్వెవు నువ్వై
వెలిగి వెలిగించాలా
నీ వెలుగుకు నీడై బ్రతుకున తోడై
ఉండిపోవాలా
నువ్వంటుంటే
నే వింటుంటే వెయ్యేళ్లు బతకాలా॥

Special Note:
Award winning nostalgic telugu song from the movie Seethamahalakshmi (1978) starring Chandramohan and Talluri Rameshwari.
Direction: K Viswanath
Music: KV Mahadevan
Lyric: Jaladi Raja Rao
Singers: SP Balasubramaniam and P Susheela

This song fetched the best lyric award for the writer Jaladi.
He is from Gudivada Krishna district.

చిత్రం : లిటిల్ హార్ట్స్(little hearts) (2001)
రచన : కులశేఖర్(kulaSEkhar)
సంగీతం : చక్రి(chakri)
గానం : సావేరి, గాయత్రి, ప్రదీప్,రవివర్మ, ప్రమోద్
(sAvEri,gAyatri,pradeep,ravivarma,pramod)

Click Play to listen the Song:


పల్లవి :
భారతజాతికి పచ్చని ధాత్రికి
జెండా పండుగ వచ్చిందోయ్
వచ్చిందోయ్ వచ్చిందోయ్
రాక్షస నీతికి స్వస్తిని పలికే
స్వేచ్ఛను నిండుగ తెచ్చిందోయ్
తెచ్చిందోయ్ తెచ్చిందోయ్
మనుషులంతా కలిసే
మనసులన్నీ మురిసే
శాంతి వెల్లివిరిసే పూలజల్లు కురిసే
హౌ గ్రేట్ ఇండియా
వుయ్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇండియా
వుయ్ లవ్ ఇండియా
వుయ్ మస్ట్ లవ్ ఇండియా॥గ్రేట్‌॥॥
చరణం : 1
వందేమాతరం... (2)
వందేమాతరమందామా
జెండా జాతర చేద్దామా
నామ్‌స్వాసకర ఇంద కాట్ర ఒండ్‌ద్రా
నమకుళ్ ఇరుదర రత్తముండ్‌ద్రా
తకధిమి తత్తోం తకధిమి తత్తోం
తకధిమి తత్తోం తిల్లానా
శుక పిక గళముల శ్రుతి సరి చేసే
ప్రార్థన గీతం పాడేద్దాం॥
భూతల స్వర్గం మనదేనంటూ
లోకాలన్నీ చాటేద్దాం
మువ్వన్నెల జెండా
రెపరెప లాడిద్దాం॥గ్రేట్‌॥॥
చరణం : 2
సారే జహాసే అచ్ఛా
హిందూసితా హమారా
ఓట్రుమై ఇరుక్కుణొం
నమ్మ ఎల్లారుం
నాటై కాపాత్కుణొం నమ్మ ఎల్లారుం॥
పరమత సహనం వరమనుకుంటూ
సహజీవనమే సాగిద్దాం తకధిమి
జనగణమనలే మన
ఎదసడులై దేశం కోసం జీవిద్దాం
మనదేశం కోసం ప్రాణాలర్పిద్దాం॥గ్రేట్‌॥॥
External Links:
bhAratajAtiki pachchani - భారతజాతికి పచ్చని
bhAratajAtiki pachchani - భారతజాతికి పచ్చని

చిత్రం : భామాకలాపం(bhAmAkalApam) (1988)
రచన : డా॥సి.నారాయణరెడ్డి(Dr C. nArAyaNareddy)
సంగీతం : సాలూరి వాసూరావు (sAlUri vAsUrAo)
గానం : ఎస్.పి.బాలు, ఎస్.పి.శైలజ(S.P.bAlu, S.P.Sailaja)
25 January _ నేడు సాలూరి వాసూరావు బర్త్‌డే



పల్లవి :
కవితా... ఆ...
ఓ... కవితా...
కవితా ఓ కవితా...
నా కవితా...
ప్రియ కవితా...
కళ్లలో కదిలే కవిత
కలల్లో కలిసే కవిత
నీవులేని జీవనం
నీరు లేని సాగరం॥॥
చరణం : 1
గాలిలో నీ కాలిసవ్వడి వింటే చాలు గాలిలో నీ కాలిసవ్వడి వింటే చాలు
ఊహల విరిజల్లు మది ఊకే పరవళ్లు
తోటలో నీ పైట నీడన ఉంటే చాలు
స్వాగత నీరాలు రసరంజిత తీరాలు
ఎలా నిన్ను మరవను
ఎలా క్షణం గడపను
నీ పాద చుంబనం
నా పూజా సాధనం (2)॥
చరణం : 2
ఎంతగా దూరాన ఉన్నా
ఎద టున్నావు
నడిచే పున్నమివై
నగవొలికే కిన్నెరివై
ఎన్నడూ మనకున్న
బంధం విడిపోలేదు
ఎవ్వరు ఏమన్నా
ఏ పువ్వులు ముళ్లైనా॥
మనది దివ్య సంగమం
మనకు దాని మందిరం॥॥
సాసస గాగగ
మామమ పాపప (2)
కవినీ కవితను వేరువేరుగా
చూసేదెవరూ
నింగి నుండి నీలిమను
విడదీసేదెవరూ
నా అక్షర కోశం విడిచే
ప్రతి నిశ్వాసం నీదే
నా ఆశయ లయలో
కదిలే ప్రతి విశ్వాసం మనదే
ఆ... ఆ... కవితా... ఓ... కవితా...

చిత్రం : ఇంద్ర(indra) (2002)
రచన : సిరివెన్నెల(sirivennela)
సంగీతం : మణిశర్మ(maNiSarma)
గానం : శంకర్‌మహదేవన్, హరిహరన్(SankarmahadEvan, harifaran)


పల్లవి :
భం భం బోలే శంఖం మోగెలే
ఢం ఢం ఢోలే చెలరేగిందిలే॥భం॥
తధినకధిం దరువై సందడి రేగనీ
పొద్దులెరుగని పరుగై
ముందుకు సాగనీ॥
విలాసంగా శివానందలహరి
మహాగంగ ప్రవాహంగా మారి
విశాలాక్షి సమేతంగా చేరి
వరాలిచ్చే కాశీపురీ॥భం॥॥॥
చరణం : 1
వారణాసిని వర్ణించే నా గీతిక
నాటి శ్రీనాథుని కవితై వినిపించదా
ముక్తికే మార్గం చూపే మణిక ర్ణిక
అల్లదే అందినాయి చిరుఘంటిక
నమక చమకాలై
ఎదలయలే కీర్తన చేయగా
యమక గమకాలై
పదగతులే న ర్తన చేయగా
ప్రతీ అడుగు తరిస్తోంది ప్రదక్షిణగా॥
కార్తీకమాసాన వేవేల దీపాల
వెలుగంత శివలీల కాదా...
ప్రియమార మదిలోన ఈశ్వరుని
ధ్యానిస్తే మనకష్టమే తొలగిపోదా
చరణం : 2
ఎదురయే శిల ఏదైనా శివలింగమే
మన్ను కాదు మహాదేవుని
వరదానమే
చిరంజీవిగా నిలిచింది ఈ నగరమే
చరితలకు అందనిదీ కైలాసమే
గాలిలో నిత్యం వినలేదా
ఆ ఓంకారమే
గంగలో నిత్యం కనలేదా
శివకారుణ్యమే
తరలిరండి తెలుసుకోండి
కాశీమహిమ ॥॥భం॥॥॥

చిత్రం : ప్రేమనగర్(prEmanagar) (1971)
రచన : ఆచార్య ఆత్రేయ(Acharya AtrEya)
సంగీతం : కె.వి.మహదేవన్(K.V.mahadevan)
గానం : ఘంటసాల(ghanTasAla)


పల్లవి :
ఎవరికోసం... ఎవరికోసం...
ఈ ప్రేమ మందిరం
ఈ శూన్యనందనం
ఈ భ గ్న హృదయం ఈ అగ్నిగుండం
ఎవరికోసం... ఎవరికోసం... (2)
చరణం : 1
ప్రేమభిక్ష నువ్వే పెట్టి
ఈ పేద హృదయం పగులగొట్టి
పిచ్చివాణ్ణి పాత్రలేని
బిచ్చగాణ్ణి చేశావు
నువ్వివ్వనిదీ దాచలేను
ఇంకెవ్వరినీ అడుగలేను
బ్రతుకు నీకు ఇచ్చాను
చితిని నాకు పేర్చావు॥
చరణం : 2
ఓర్వలేని ఈ ప్రకృతి
ప్రళయంగా మారనీ
నా దేవి లేని ఈ కోవెల
తునాతునకలైపోనీ
కూలిపోయి ధూళిలో కలసిపోనీ
కాలిపోయి బూడిదే మిగలనీ॥
చరణం : 3
మమత నింపమన్నాను
మనసు చంపుకొన్నావు
మధువు తాగనన్నాను
విషం తాగమన్నావు
నీకు ప్రేమంటే నిజం కాదు
నాకు చావంటే భయం లేదు
నీ విరహంలో బ్రతికాను
ఈ విషంతో మరణిస్తాను...
మరణిస్తాను...

చిత్రం : బండరాముడు (1959)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి
గానం : పి.సుశీల
Photo:సుసర్ల దక్షిణామూర్తి


పల్లవి :
సాగిపోయే
ఓ చందమామా...
ఆగుమా...
ఒకసారి ఆగుమా...
ఒకసారి ఆగుమా
ఓ చందమామా
మనసార నా మాట ఆలించి పొమ్మా॥
చరణం : 1
నీలి మబ్బుల తెరచాటు మాటున
మాటి మాటికి ఇటు దాగనేల... ఓ...॥
ఎందుకో చనలేవు సూటిగ (2)
ఎదలోన నీవైన యోచించుకొమ్మా॥
చరణం : 2
పరుల సొమ్మును
హరియించు వాడె
పగటిపూటను
ఇలు వీడలేడోయ్‌॥
మంచిగా మనవోయి
జాబిలి (2)
మలినమ్ము ఇకనైన
తొలిగించుకొమ్మా॥
మారేనా నీ మనసు ఓ చందమామా
మారేనా నీ మనసు ఓ చందమామా
ఓ చందమామా... ఓ చందమామా

Special Note:

కృష్ణాజిల్లాలోని దక్షిణ కాశీగా ప్రసిద్ధికెక్కిన పెద కళ్లేపల్లి గ్రామంలో కృష్ణబ్రహ్మశాస్త్రి, అన్నపూర్ణ దంపతులకు నవంబర్ 11న 1921లో జన్మించారు దక్షిణామూర్తి. ఆయనకు ఒక అక్క, అయిదుగురు చెల్లెళ్లు. వీరిది సంగీతజ్ఞుల వంశం. తాతగారైన సుసర్ల దక్షిణామూర్తిశాస్త్రి సాక్షాత్తూ త్యాగరాజ శిష్యపరంపరకు చెందినవారు. దక్షిణామూర్తి 16వ ఏటనే వయొలిన్ కచ్చేరీ చేశారు. కొన్నాళ్లు హెచ్.ఎం.వి. సంస్థలో కూడా పనిచేశారు. తెలుగులో ‘నారద నారది (1946)’ చిత్రంతో తెరంగేట్రం చేశారు. ‘సంసారం (1950)’ చిత్రంలో ఆయనకంటూ ఒక గుర్తింపు వచ్చింది. తెలుగు, తమిళ, మళయాళ, కన్నడ, సింహళ, ఆంగ్ల భాషలలో దాదాపు 135 చిత్రాలకు సంగీతం అందించారు. 1984లో వచ్చిన ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ తెలుగులోవీరు సంగీతం అందించిన ఆఖరి చిత్రం.

pillA chAvvE (business man) - పిల్లా చావ్వే(బిజినెస్‌మేన్)

చిత్రం : బిజినెస్‌మేన్(business man) (2012)
రచన : భాస్కరభట్ల రవికుమార్(bhaskarabhaTla ravikumar)
సంగీతం : ఎస్.ఎస్.థమన్(S.S.thaman)
గానం : రాహుల్ నంబియార్(rAhul nambiyAr)
Photo:రాహుల్ నంబియార్

పల్లవి :
పిల్లా చావ్వే...
ఐ లవ్ యూ
అంటే...
ఛీ కొట్టీ పోతావ్
ఓ పిల్లా చావ్ పిల్లా చావ్ పిల్లా
చావ్ చావ్ చావ్
తేరేలియే...
పిచ్చెక్కిపోయే
నన్నిట్టా వదిలీ పోతావా... (2)
మంచోణ్ణే కాదా? నేన్నచ్చలేదా?
ఓ పిల్లా చావ్ పిల్లా చావ్ పిల్లా
చావ్ చావ్ చావ్
మేరేలియే... ఓ సూపు సూడే
ఏంటంతా కోపం నా మీద (2)
పిల్లా చావ్వే...

చరణం : 1
చూపుల్నే ఎర గా వేసి చేపల్లే పట్టేశావ్
ఊరించే వయ్యారంతో
ఉడుమల్లే చుట్టేశావ్
హస్కీగా నవ్వే నవ్వీ
విస్కీలా ఎక్కేశావ్
నా దిల్లో మంచం వేసి
దర్జాగా బజ్జున్నావ్
నాక్కూడా
తెలియకుండా
నా మనసే కొట్టేశావ్
కాబట్టే పిల్లా
ఎంతో ముద్దొచ్చావ్॥॥చావ్వే॥

చరణం : 2
నీ అందం రైలింజన్‌తో
నా మనసుని తొక్కించావ్
నన్నిట్టా భూ చక్రంలా
నీ చుట్టూ తిప్పించావ్
నడుమట్టా ఇట్టా తిప్పి
నను బోర్లా పడగొట్టావ్
దుప్పల్లో దోమై దూరీ
నిద్దర్నే చెడగొట్టావ్
నా దారిన్నే పోతుంటే
నువ్వెందుక్కనిపించావ్
నా దిక్కూమొక్కూ
నువ్వే అనిపించావ్॥॥చావ్వే॥

I Love you ante chi kotti pothav
o pilla chao pilla chao pilla chao chao chao
tere liye pichekki poye
nannitta vadili pothaava nannitta vadilipotahava
manchonne kaada nennachaleda
o pilla chao pilla chao pilla chao chao chao
mere liye oo soopu soode
entantha kopam na meeda entantha kopam naameeda

pilla chaavey...

chupulne yera ga vesi chapelle pattesaav
oorinche vayyaram tho udumalle chuttesaav
husky ga navve navvi whisky la ekkesav
na dil lo mancham vesi darjaga bajjunnav
nakkuda theliyakunda na manase kottesav
kabatte pilla entho muddhochaav

tere liye pichekki poye
nannitta vadili pothaava nannitta vadilipotahava


pilla chaavey...

I Love you ante chi kotti pothav
o pilla chao pilla chao pilla chao chao chao
tere liye pichekki poye
nannitta vadili pothaava nannitta vadilipotahava

hey pilla nee meeda why did I go deewana
why dont you go to hell are ja ja tu marjaana
tu ne is dil ko toda jab tha mein anjaana
dil meri jindagi mein tu kabhi na aana

nee andam rail engine tho na manasuni thokkinchav
nannintta bhuchakram la nee chuttu tippinchav
nannu atta itta thippi nanu borla padagottav
duppatlo domai doori niddarne chedagottav
na darina nepothunte nuvvenduku kanipinchav
na dikku mokku nuvve anipinchaav

mere liye oo soopu soode
entantha kopam na meeda entantha kopam naa meeda

pilla chaavey...

I Love you ante chi kotti pothav
o pilla chao pilla chao pilla chao chao chao
tere liye pichekki poye
nannitta vadili pothaava nannitta vadilipotahava

manchonne kaada nennachaleda
o pilla chao pilla chao pilla chao chao chao
mere liye oo soopu soode
entantha kopam na meeda entantha kopam naameeda

pilla chaavey...

చిత్రం : తులసి(tulasi) (1974)
రచన : ఆరుద్ర(Arudra)
సంగీతం : ఘంటసాల(ghanTasAla)
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల(S.P.bAlu,P.suseela)
20 January - నేడు కృష్ణంరాజు బర్త్‌డే


పల్లవి :
లలలలాలలాల ఆహా... (2)
అహహహా... హా...
అహహహా... హా
సెలయేటి గలగలా
చిరుగాలి కిలకిలా (2)
సిగ్గుపడే బుగ్గలతో
చెలి నవ్వులే మిలమిల
చిలిపి చిలిపి చూపులతో
నీ ఊహలే తళతళ

చరణం : 1
చందమామ కన్నా నీ చెలిమి చల్లన
సన్నజాజి కన్నా నీ మనసు తెల్లన
నిన్ను కౌగిలించ గుండె ఝల్లన
ఆ... నిన్ను కౌగిలించ గుండె ఝల్లన
నిలువెల్ల పులకించె మెల్లమెల్లన॥

చరణం : 2
పసినిమ్మ పండుకన్న నీవు పచ్చన
ఫలియించిన మన వలపే
వెచ్చవెచ్చన
అనురాగం ఏదేదో అమరభావన అనురాగం ఏదేదో అమరభావన
అది నీవు దయచేసిన గొప్ప దీవెన॥


Special Note:
కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి చిన వెంకట కృష్ణంరాజు. స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరు. జనవరి 20, 1940లో జన్మించిన కృష్ణంరాజు దాదాపు 188 సినిమాలలో నటించారు. కె.ప్రత్యగాత్మ దర్శకత్వంలో 1966లో వచ్చిన ‘చిలకా గోరింక’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఇప్పటి వరకూ ఆయన ఐదు ఫిలిం ఫేర్ అవార్డులు, ఫిలిం ఫేర్ లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డు, ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి రెండు సార్లు నంది అవార్డులు అందుకున్నారు.

చిత్రం : 100% లవ్(100% Love) (2011)
రచన : చంద్రబోస్(chandrabOse)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్(dEviSrI prasAd), గానం : టిపు(Tipu)
Photo:టిపు(Tipu)


పల్లవి :
దూరం దూరం
దూరం... ఓఓఓ...
తీరం లేని దూరం
ఒకే పరీక్షే రాసిన
ఒకే జవాబై సాగినా
చెరో ప్రశ్నల్లే మిగిలినారే
ఒకే పడవలో కలిసినా
ఒకే ప్రయాణం చేసినా
చెరో ప్రపంచం చేరినారే
ఒకే గతాన్ని ఓ...
ఒకే నిజాన్ని ఉరేసినారే ఓ...
చెరో సగాన్ని ఓ...
మరో జగాన్ని వరించినారే ఓ...॥పరీక్షే॥॥

చరణం : 1
ఇంత దగ్గర అంతులేని దూరం
ఇంత కాలము దారి లేని దూరం
జంట మధ్య చేరి వేరు చేసే
దారే నాదే అన్నదే హో ఓ...
స్నేహమంటు లేక ఒంటరైన దూరం
చుట్టమంటు లేని
మంటతోనే దూరం
బంధనాలు తెంచుతూ
ఇలా భలేగా మురిసే
ఎడబాటులోని
చేదు తింటూ దూరం
ఎదుగుతున్నదే
విరహాల చిమ్మ చీకటింట
దూరం వెలుగుతున్నదే॥పరీక్షే॥॥

చరణం : 2
ఒక్క అడుగు వెయ్యలేని దూరం
ఒక్క అంగుళం వెళ్లలేని దూరం
ఏడు అడుగులు చిన్ని దూరాన్ని
చాలా దూరం చేసిందే
మైలు రాయికొక్క మాట మార్చు
దూరం... దూర ం...
మలుపు మలుపుకొక్క దిక్కు మార్చు
దూరం... దూర ం...
మూడుముళ్ల ముచ్చటే
ముళ్లబాటగా మార్చే
తుదిలేని జ్ఞాపకాన్ని
తుడిచివేసే దూరమన్నది
మొదలైన చోటు మరిచిపోతే
కాదే పయనమన్నది॥పరీక్షే॥॥

duram Duram Duram
Ooo.. Tiram Leni Duram
Oke Pariksha Raasina Oke Javaabai Saaginaa
Cero Prashnalle Migilinaare..
Oke Padavalo Kalisinaa Oke Prayaanam Cesinaa
Cero Prapamcam Cerinaare..
Oke Gataanni O O O..oke Nijaanni..uresinaare..o O O

O O O..o O O...o O O
Cero Sagamai
O O O Maro Jagaanni Varimcinaare .. O O O..
Oke Pariksha Raasina Oke Javaabai Saaginaa
Cero Prashnalle Migilinaare..
Duram Duram Duram
Ooo.. Tiram Leni Duram O O O..

Imta Daggara Amtuleni Duram
Imta Kaalamu Dhari Leni Duram
Jamta Madya Ceri Veru Cese Daare
Naade Annade....
Hoo..
Snehamamtu Leka Omtaraina Duram
Cuttamamtu Leni Mamtatone Duram
Bamdanaalu Temcutu Ilaa Bhalegaa Murise
Edabaatuloni Cedu Timtu Duram Edugutunnaade..
Virahaala Cimma Cikatimta Duram Velugutunnaade..
Oke Pariksha Raasina Oke Javaabai Saaginaa
Cero Prashnalle Migilinaare..
Duram Duram Duram
Ooo.. Tiram Leni Duram

Okka Adugu Veyyaleni Duram
Okka Amgulam Veyyaleni Duram
Edu Adugula Cinni Duraanni
Caalaa Duram Cesimde
Mailu Raayikokka Maata Maarcu
Duram..duram..
Mudu Mulla Muccate Mulla Baatagaa Maarce

Tudi Leni J~jaapakaanni Tudicivese Duramannadi..
Modalaina Cotu Maracipote Kade Payana Mannadi..
Oke Pariksha Raasina Oke Javaabai Saaginaa
Cero Prashnalle Migilinaare..
Duram Duram Duram
Ooo.. Tiram Leni Duram

Click to listen this song:

చిత్రం : ప్రళయం(praLayam) (1986)
రచన : అదృష్టదీపక్ (adrusTadeepak)
సంగీతం : కె.వి.మహదేవన్(K.V.mahadevan)
గానం : కె.జె.ఏసుదాస్, కె.ఎస్.చిత్ర(K.J.aesudAs, K.S.chitra)

పల్లవి : సరిగమ స్వరమేళనం జీవితం
నవరస సురఖేలనం శాశ్వతం॥
విరిసిన ప్రకృతి దరహాసంలో
సిరిసిరి వెన్నెల మధుమాసంలో॥
సా సారిసని ససరి సరి సని (2)
గసగా గసగా గసగా గసగా

చరణం : 1 కొత్త కోరికలు నిండిన
కొండగాలి తిరిగింది (2)
కొసరి కొసరి కొమ్మమీద
కోయిలమ్మ కూసింది ॥
మధురమైన భావానికి
పల్లవి దొరికింది (2)
అందమైన పాటకు
అభినందన తెలిపింది॥॥
సారి ససగరి ససమగా సారి
నీసా నినిరినిరిని నిగరీ నీసా

చరణం : 2 ఇన్ని వసంతాలు గడిచి
ఏ తీరం చేరాయో
వన్నెలన్ని నడచి నడచి
ఏ దూరం సాగాయో ॥
ఇంద్రధనువు రథం మీద
వెళ్లి తెచ్చుకుందాము
గరిగరినిద రినిరినిదమ నిదనిదమగ
మాదానీరీ ॥
చంద్రకాంతి పందిరిలో
ప్రేమ పంచుకుందాము॥॥

Special Note:
అదృష్టదీపక్ రావులపాలెంలో 1950లో జన్మించారు. గత నలబై ఏళ్లుగా రామచంద్రా పురంలో నివసిస్తున్నారు. 1980లో వచ్చిన ‘యువతరం కదిలింది’ అనే చిత్రంలో ‘ఆశయాల పందిరిలో... అనురాగం సందడిలో...’ అనే పాట ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఆయన రాసిన నలబై పాటలు సందేశాత్మకమైనవి. అవి ఎంతో ప్రజాధరణ పొందాయి. పై పాట ప్రముఖ గాయని చిత్రకు తెలుగులో మొదటిది కావడం విశే షం.

nA chempa tAkagAnE - నా చెంప తాకగానే



Click 'Play' to listen this Song:

External Link:
nA chempa tAkagAnE - నా చెంప తాకగానే

చిత్రం : పండగ(paNDaga) (1998)
రచన : చంద్రబోస్(chandrabOs)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి(M.M.KeeravANi)
గానం : మనో, చిత్ర, బృందం(manO,chitra group)

External Link:
A mutyAla muggullO - ఆ ముత్యాల ముగ్గుల్లో
పల్లవి :
ఆ... ముత్యాల ముగ్గుల్లో
ఆ... రతనాల గొబ్బిళ్లో
ముద్దబంతులు మువ్వమోతలు
నట్టింట కాలుపెట్టు పాడిపంటలు
వెండిముగ్గులు పైడికాంతులు
పుట్టింట దీపమెట్టు ఆడపడుచులు॥
కలబోసి విరబూసే
మహదండిగా మదినిండగా
చలి పండుగే సంక్రాంతి॥

చరణం :
అత్తింట సాగుతున్న
అల్లుళ్ల ఆగడాలు భోగి పళ్లుగా
కంగారు రేపుతున్న
కోడళ్ల చూపులన్నీ భోగిమంటగా
ఉన్నమాట పైకి చెప్పు
అక్కగారి వైనమేమో సన్నాయిగా
దేనికైన సిద్ధమైన బావగారి
పద్ధతేమో బసవన్నగా
పిల్లపాపలే పచ్చతోరణాలుగా
పాలనవ్వులే పచ్చి పాయసాలుగా
కలబోసి తెరతీసి కనువిందుగా
మనకందిన సిరిసంపదే సంక్రాంతి॥
మనసును చూసే కన్నులు ఉంటే
పగలే వెన్నెల రాదా
మమతలు పూసే బంధాలుంటే
ఇల్లే కోవెల కాదా
మన అనువాళ్లే నలుగురు ఉంటే
దినము కనుమే కాదా
దేవతలేని దేవుడు నీవు ఇల చేరావు
కనలేని కొనలేని అనురాగమే నువు
పంచగా అరుదెంచదా సుఖశాంతి॥
Click to Listen Song:

Special Note:
చంద్రబోస్ పూర్తి పేరు సుభాష్ చంద్రబోస్. స్వస్థలం వరంగల్ జిల్లాలోని చల్లగరిగ గ్రామం. తాజ్‌మహల్ (1995) చిత్రంలో ‘మంచుకొండల్లోన చంద్రమా చందనాలు చల్లిపో’ అనే పాట ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు.

చిత్రం : బాడీగార్డ్(bodyguard) (2012)
రచన : భాస్కరభట్ల రవికుమార్(bhAskarabhatla ravikumar)
సంగీతం : ఎస్.ఎస్.థమన్(S.S.thaman)
గానం : బాబా సెహగల్, రమ్య,రాహుల్ నంబియార్,ఎం.ఎల్.ఆర్. కార్తీక్, నవీన్ మాధవ్
(bAba sehagal,ramya,rAhul nambiyAr,M.L.R.kArthIk,vaveen,mAdhav)


సాకీ :
ఆంజనేయుడూ రాముడి బాడీగార్డ్
గోకులానికీ కృష్ణుడు బాడీగార్డ్
సూర్యచంద్రులూ నింగికి బాడీగార్డ్
మంచికి ఎప్పుడూ ఇతడే బాడీగార్డ్

పల్లవి :
పుట్టగానే...
నువు పుట్టగానే అమ్మ బాడీగార్డ్
నువు ఎదుగుతుంటే నాన్న బాడీగార్డ్
ఆపైన నేనే మీకు బాడీగార్డ్
సబ్ కేలియే హామే న హీ గాడ్
బ్యాడ్‌కేమో ఐ యామ్ వెరీ బ్యాడ్
ఆగయా మే ఆయా బాడీగార్డ్

చరణం :
ఆగే చలో చలో ఏమీ కాదూ
ధైర్యం నీతో ఉంటే భయం రాదూ
దిల్లూ దమ్మూ ఉంటే
నీ దారికి అడ్డేలేదు
దుమ్మూరేగాలంటే ఆలోచించొద్దూ
గాంధీ అన్నాహజారే
మీలో కూడా ఉన్నారే
ఈ దేశానికి ఒకొక్కడూ
ఒక్కో బాడీగార్డ్
గస్తీ కాసేద్దాం హాత్ మిలావ్ యార్॥
మాట ఇస్తే కట్టుబడేవాడ్
మనసులన్నీ దోచుకునేవాడ్
ఆంఖ్ మారే ఆజా బాడీగార్డ్


Special Note:
భాస్కరభ ట్ల జూన్ 5, 1974లో శ్రీకాకుళం జిల్లాలోని బూరవెల్లి గ్రామంలో జన్మించారు. రాజమండ్రి, హైదరాబాద్‌లలో దాదాపు పదేళ ్ల పాటు జర్నలిస్ట్‌గా పనిచేసి ఆ తర్వాత గీత రచయితగా మారారు. 2000 వ సంవత్సరంలో వచ్చిన ‘గొప్పింటి అల్లుడు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు.

sir ostArostArA (Business Man) - సారొస్తారొస్తారా (బిజినెస్‌మేన్)

చిత్రం : బిజినెస్‌మేన్(Business man) (2012)
రచన : భాస్కరభట్ల రవికుమార్(bhAskarabhatla ravikumar)
సంగీతం : ఎస్.ఎస్.థమన్(S.S.thaman)
గానం : సుచిత్ర, థమన్(suchitra, thaman)


పల్లవి :
సారొస్తారొస్తారా రత్తా రత్తా రత్తారే
దావత్తే ఇస్తారా రత్తా రత్తారే॥
ఒంటిగంట కొట్టినాక ఓరి నాయనో
వేడిపుట్టె ఒంటిలోన ఏటి సెయ్యనో
సారొస్తారొస్తారే సారొస్తారొస్తారే
కోరికేదో రేపుతుంటే యాడదాచనో
లంగరేసి లాగుతుంటే ఎట్టా ఆగనూ
వాలుకళ్లకే నచ్చినావు తెగ
లోపలెక్కడో అంటుకుంది సెగ
నీ చూపు కందిరీగ కొరికి తినగా
తుఝ్‌పే ఫిదా హోగా ॥
ముద్దబంతి దావే రావే
ముద్దుగుమ్మ దావే రావే
ముస్తాబయ్యి దావే రావే
ముద్దులిచ్చి పోవే పోవే
హే హే వస్తాలే వస్తాలే వస్తాలే

చరణం :
రామసిలకో రాను అన కో
మేరే దిల్లు కో ఫరక్ లేదు గిల్లుకో
బెంగ తీరిపోద్దే అల్లుకో
ఇది ఉడుకో లేక దుడుకో
అగ్గి రాజుకుంటే సుప్పనాతి ఇనకో
సిగ్గు పానకంలో జరజర పుడకో
తేరే నజరోంకా ఏక్ ఇషారా
మై ఛోడ్ చలూం జగ్ సారా
తేకీ బాహోంకా సహారా మాంగో
దుబారా జర థామ్ లే యారా॥
సారొస్తా... సారొస్తా...॥

;;
Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |