Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : వంశీ (2000)
రచన : సిరివెన్నెల
సంగీతం : మణిశర్మ
గానం : ఉదిత్‌నారాయణ్, సుజాత


పల్లవి :
కోయిలమ్మ పాడుతున్నది కన్నుల్లో
కన్నె బొమ్మ ఆడుతున్నది
పూలకొమ్మ ఊగుతున్నది గుండెల్లో
కోరికమ్మ రేగుతున్నది
వేడి పెంచక ఏడిపించక
ఈడు పంచి ఊరడించరాదా
గోరువెచ్చగ గోలరెచ్చెగ
జోడుకట్టి జోలకొట్టరాదా
అయితే పద ఓ సంపద తీర్చేదే నీ బాధ


చరణం : 1
సున్నితాల సొంపులోన కన్నెచూపు జారిపడ్డదే
కన్ను దాడినాపలేక చిన్నదాని సిగ్గు చెడ్డదీ
వదిలితే మరి దొరకదే ఈ చోటెంత బాగుందీ
బెదిరితే కథ కదలదే
అని త హతహ తరుముతు ఉన్నదీ
ఈడాపదా తీరేదెలా ఏదోటి చెయ్యందే


చరణం : 2
లెక్క చేయమాకు నువ్వు
సిగ్గులెంత బుగ్గనొక్కినా
పక్కకెళ్లిపోకు నువ్వు చుక్కలెన్ని నిక్కి చూసినా
అడగనా ఒక బహుమతి
నువు ఛీ పాడు అనకుంటే
అడగద్దు ఎవరనుమతి
చెలి తడితడి పెదవులు అందితే
కయ్యానికే తయారయ్యి సై ఆట సయ్యందే ॥

09 August - నేడు మహేష్‌బాబు బర్త్‌డే

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |