Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

niduri~nche tOTalOki - నిదురించే తోటలోకి

చిత్రం : ముత్యాలముగ్గు(MutyAla Muggu) (1975)
రచన : గుంటూరు శేషేంద్ర శర్మ
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : పి.సుశీల
20 October - నేడు గుంటూరు శేషేంద్ర శర్మ జయంతి


పల్లవి :

నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది
కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది॥

చరణం : 1
రమ్యంగా కుటీరాన రంగవల్లులల్లింది
దీనురాలి గూటిలోన దీపంగా వెలిగింది॥
శూన్యమైన వేణువులో ఒక స్వరం
కలిపి నిలిపింది (2)
ఆకురాలు అడవికి ఒక ఆమని దయ చేసింది॥

చరణం : 2
విఫలమైన నా కోర్కెలు వేలాడే గుమ్మంలో
ఆశల అడుగులు వినబడి అంతలో పోయాయి॥

కొమ్మల్లో పక్షుల్లారా గగనంలో మబ్బుల్లారా
నది దోచుకుపోతున్న నావను ఆపండి
రేవు బావురుమంటోందని నావకు చెప్పండి

Comments