Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

చిత్రం : శాంతినివాసం(Santi nivasam) (1960)
రచన : సముద్రాల జూనియర్(samudrala jurnior)
సంగీతం : ఘంటసాల(ghanTasAla)
గానం : ఘంటసాల, పి.సుశీల
02 May - నేడు దేవిక వర్ధంతి

 

పల్లవి : రాగాలా సరాగాలా
హాసాలా విలాసాలా
సాగే సంసారం హాయ్
సుఖజీవనసారం॥
చరణం : 1
పతి పదసేవయే
యోగముగా
నాతికి పతియే
దైవముగా ॥
సతి సౌభాగ్యాలే
తన భాగ్యమనే
భావనయే పతి ధర్మముగ॥సౌభాగ్యాలే॥॥
చరణం : 2
మాయని ప్రేమల
కాపురమే
మహిలో వెలసిన
స్వర్గముగా॥
జతబాయని కూరిమి
జంటగ మెలిగే
దంపతులే
ఇల ధన్యులుగా॥॥


Special Note:
దేవిక అసలు పేరు ప్రమీలాదేవి. ఈమె చిత్తూరు జిల్లా, చంద్రగిరిలో జన్మించారు. రంగస్థలనటిగా జీవితాన్ని ప్రారంభించిన దేవిక ఎస్.వి.సహస్రనామం బృందం ప్రదర్శించిన అనేక నాటకాలలో వివిధ పాత్రలలో పోషించారు. తెలుగులో ఎన్‌టిఆర్ సరసన హీరోయిన్‌గా ‘రేచుక్క (1954)’ సినిమాతో తెరంగేట్రం చేశారు. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలలో దాదాపు 150 చిత్రాలకు పైగా నటించారు. తెలుగులో ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామిచరిత్ర (1984)’ ఆమె నటించిన ఆఖరి చిత్రం. తెలుగు చలనచిత్ర పితామహుడైన ‘రఘుపతి వెంకయ్యనాయుడు’కి దేవిక సమీప బంధువు. ఈమె కుమార్తె కనక తెలుగు, తమిళ చిత్రాలలో నటించారు. దేవిక 2002, మే 2న తీవ్ర అస్వస్థతతో మద్రాస్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు.

చిత్రం : విప్లవశంఖం(viplava Sankham) (1982)
రచన : అదృష్టదీపక్(adrushTa deepak)
సంగీతం : చక్రవర్తి(chakravarti)
గానం : ఎస్.పి.బాలు, శైలజ(S.P.bAlu,Sailaja)

పల్లవి :
ఎన్నాళ్లు ఎన్నేళ్లు ఈ పాట్లు పడతావు
ఇకనైన మేలుకో నీ రాజ్యం ఏలుకో ఇకనైన మేలుకో నీ రాజ్యం ఏలుకో
//ఎన్నాళ్లు//
చరణం : 1
కనుల నిండిన కలలు
కరిగి నీరైనాయి
కోరికల దీపాలు కొండెక్కిపోయాయి
పచ్చపచ్చని బ్రతుకు
బంజరైపోయింది
దేశమంతా ఈనాడు
శోకమై మిగిలింది
//ఎన్నాళ్లు//
చరణం : 2
ఏ ఎదను కదిపినా ఎక్కిళ్లూ ఏడ్పులే
ఏ మోము చూసినా వేడి నిట్టూర్పులే
చితికిపోయిన బ్రతుకుల్ని
చిగురింపజెయ్యాలి
వల్లకాటికి తిరిగి
నవ వసంతం తేవాలి //ఎన్నాళ్లు//
చరణం : 3
కార్మికులు కర్షకులు
కలసికట్టుగ కదిలి
అవినీతి అక్రమాలను
అంతం చెయ్యాలి
నవయుగానికి బాటలు వేసే
యువతరం
పీడనకు దోపిడికి ఖబడ్దార్ చెప్పాలి
ఖబడ్దార్... ఖబడ్దార్...
ఇకనైన మేలుకో నీ రాజ్యం ఏలుకో
//ఎన్నాళ్లు//

pADavEla rAdhikA - పాడవేల రాధికా

చిత్రం : ఇద్దరు మిత్రులు(iddaru mitrulu) (1961)
రచన : శ్రీశ్రీ(SrI Sri)
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు(sAlUri rAjEswararAo)
గానం : పి.సుశీల, ఘంటసాల(P.suseela,ghanTasAla)
30 April - నేడు శ్రీశ్రీ జయంతి


పల్లవి : ఆ... ఆ... ఆ... ఓ... ఓ... ఓ...
పాడవేల రాధికా ప్రణయసుధా గీతిక (2)
॥ పాడవేల ॥
చరణం : 1
ఈ వసంత యామినిలో... ఓ...
ఈ వెన్నెల వెలుగులలో... ఓ...
॥ ఈ వసంత॥
జీవితమే పులకించగ...
జీవితమే పులకించగ నీ వీణను సవరించి
పాడవేల రాధికా...
చరణం : 2 గోపాలుడు నిను వలచి
నీ పాటను మది తలచి (2)
ఏ మూలనో పొంచి పొంచి...
ఏ మూలనో పొంచి పొంచి
వినుచున్నాడని యెంచి
పాడవేల రాధికా...
చరణం : 3 వేణుగానలోలుడు
నీ వీణామృదురవము వినీ (2)
ప్రియమారగ నినుచేరగ
దయచేసెడి శుభవేళ
॥ పాడవేల ॥

Special Note:
పూర్తిపేరు :
శ్రీరంగం శ్రీనివాసరావు
జననం : 30-04-1910
జన్మస్థలం : విశాఖపట్టణం
తల్లిదండ్రులు : అప్పన్నకొండ,
వెంకటరమణయ్య
చదువు : బి.ఏ.
వివాహం-భార్య :
1925-వెంకటరమణమ్మ
1956-యు.సరోజ

పిల్లలు : దత్తపుత్రిక (లెనీనా), ముగ్గురు కుమార్తెలు (మంజుల, మంగళ, మాల),
ఒక కుమారుడు (రమణ)
తొలి డబ్బింగ్ చిత్రం-పాట : ఆహుతి (1950) - ప్రేమయే జనన మరణ లీల
ఆఖరిచిత్రం : దాహం దాహం (1982)
తెలుగులో నేరుగా తొలిచిత్రం : నిర్దోషి (1951)
ఆఖరిచిత్రం-పాట : నేటి భారతం (1983) - అర్ధరాత్రి స్వతంత్రం అంధకార బంధురం

పాటలు : నేరుగా తెలుగులో దాదాపు 500, డబ్బింగ్ పాటలు 800, మొత్తం 1300 అని ఒక అంచనా. లభించినంత వరకు నేరుగా తెలుగులో 400, డబ్బింగ్ పాటలు 500.
అవార్డులు : అల్లూరి సీతారామరాజు (1974) లో ‘తెలుగువీర లేవరా... దీక్షబూని సాగరా’ అనే పాటకు జాతీయ అవార్డు, 1979లో రాజాలక్ష్మీ పౌండేషన్ అవార్డు, నేటిభారతం (1983)లో ‘అర్ధరాత్రి స్వతంత్రం అంధకార బంధురం’ పాటకు నందిఅవార్డు అందుకున్నారు.

ఇతరవిషయాలు : 10 ఏళ్ల వయసు నుండే నవలలు రాయడం మొదలుపెట్టారు శ్రీశ్రీ. మద్రాస్‌లో బి.ఏ. పూర్తి చేశారు. ఆ తర్వాత విశాఖ హార్బర్‌లో మిసెస్ ఏవీయన్ కాలేజీలో జంతుశాస్త్ర విభాగంలో డిమాన్‌స్ట్రేటర్‌గా ఆంధ్రప్రభ ఉపసంపాదకునిగా మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో విశాఖలో ‘నటాలి’ స్వచ్ఛంద సంస్థలో రచయితగా హైదరాబాద్ నిజాం రిఫరం సెక్రటేరియట్‌లో పౌరసంబంధ ఉద్యోగిగా ఆనందవాణి సాహిత్య పత్రికకు సంపాదికునిగా... ఎన్నో ఉద్యోగాలు చేశారు శ్రీశ్రీ. డబ్బింగ్ చిత్రాల రచన ‘శ్రీశ్రీ’ తోనే ఆరంభమైంది. 1940లో శ్రీశ్రీ ‘మహా ప్రస్థానం’, ఇతర గీతాలు సిద్ధమయ్యాయి. అవి 1950 నాటికి పుస్తకరూపం దాల్చాయి.
మరణం : 05-06-1983