Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

evariki evaru kApalA - ఎవరికి ఎవరు కాపలా

చిత్రం : ఇంటికి దీపం ఇల్లాలు(inTiki deepam illAlu) (1961)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : విశ్వనాథన్-రామ్మూర్తి
గానం : పి.బి.శ్రీనివాస్


పల్లవి :
ఎవరికి ఎవరు కాపలా... ఆ...
బంధాలన్నీ నీకేలా॥
ఈ బంధాలన్నీ నీకేలా॥
చరణం : 1
తనువుకు ప్రాణం కాపలా
మనిషికి మనసే కాపలా
తనువును వదిలి తరలే వేళ...
తనువును వదిలి తరలే వేళ
మన మంచే... మనకు కాపలా॥
చరణం : 2
కంటికి రెప్పే కాపలా
కలిమికి ధర్మం కాపలా
కలిమి సర్వము తొలగిన వేళ
పెట్టినదేరా... గట్టి కాపలా॥
చరణం : 3
చిన్నతనాన తల్లి కాపలా
వయసున వలచిన వారు కాపలా
ఎవరి ప్రేమకు నోచని వేళ
కన్నీరేరా... నీకు కాపలా
కన్నీరేరా నీకు కాపలా॥

bhAg sAlE bhAg sAle - భాగ్ సాలే భాగ్ సాలే

చిత్రం : బిజినెస్‌మేన్ (Business man) (2012)
రచన : భాస్కరభట్ల రవికుమార్
సంగీతం : ఎస్.ఎస్.థమన్
గానం : మహేష్‌బాబు,పూరీ జగన్నాథ్, రంజీత్,రాహుల్, నవీన్ మాధవ్, అలాప్ రాజు


భాగ్ సాలే... భాగ్ సాలే... భాగ్ సాలే...
కలబడితే వదలనొరేయ్...
కలబడితే వదలనులే
మరిగితె కుతకుత తెగబడి నరుకుత
ఆడూలేదు ఈడూలేదు
జాగానైరే తేరరేకొ చల్‌బే
బిచాణా సర్ది చల్‌బే...
భాగ్ సాలే...

కనికరమే తెలవదురోయ్
జగజగజగడమే
జడవక దిగడమే
దందా నాది ధమ్‌కీ నాదీ
ఆజ్ సే మేరా అడ్డా చల్‌బే
మారుంగామే సాలే తూ చల్‌బే
భాగ్ సాలే... సాలే భాగ్
పరిగెత్తాలే...

ఇది నా యిలాకా... నాతోటి యెట్టుకోక
నా జోలికొచ్చి కెలికితే రేగుతాది కాక
భాగ్ సాలే...
యే మేరా అడ్డా హై... తూ హఠ్ జారే సాలే
భాగ్ సాలే... భాగ్ సాలే...
దిల్ బహారే ముంబై... జాన్ ఉడారే ముంబై...

గుర్తుపెట్టుకో...
నీకంటే తోపెవడూ లేడిక్కడ
నీకేదనిపిస్తే అది చెయ్యి
ఎవడి మాటా వినద్దు మనిషి మాట అసలు వినద్దు
నీ టార్గెట్ టెన్ మైల్సైతే
ఎయిమ్ ఫర్ ద లెవెన్త్ మైల్
కొడ్తే దిమ్మతిరిగిపోవాలి...
చల్... భాగ్ సాలే...

EnATikI manamokaTEnani - ఏనాటికీ మనమొకటేనని

చిత్రం : శివమణి (SivamaNi) (2003)
రచన : భాస్కరభట్ల
సంగీతం : చక్రి
గానం : రఘు కుంచె, కౌసల్య


పల్లవి :
ఏనాటికీ మనమొకటేనని
ఏ చీకటి ఇటు రాలేదని
పొరపాటుగా అనుకున్నామని
తెలిసిందిలే కలగన్నామని
కన్నీరు జోరయ్యింది
ఆ నీరు ఏరయ్యింది
నువ్వు లేక సంతోషమా
వాకిట్లో వసంతాలు ఆనాటి సాయంత్రాలు
నువ్వు లేక శూన్యం సుమా
నాతోనే నువ్వు ఉంటానని
ఆరోజే నువ్వు అన్నావని
ఎలా నేను మరిచేది ఓ నేస్తమా॥
చరణం : 1
నీ కోసమే మిగిలున్నానిలా
నువ్వురాక నేనింక ఎన్నాళ్లిలా
నా గుండెలో నీ ఆలోచన
నా కంటిపాపల్లో ఆవేదన
ఇది మౌనరాగాల సంకీర్తన
ఇలా చూడు ఏవైపు అడుగేసినా
నీలోనే సగమున్నాననీ
నీకోసం మిగిలున్నాననీ
ఎలా నీకు తెలిపేది
ఓ నేస్తమా॥
చరణం : 2
మరుపన్నది ఇటు
రాదే ఎలా
నా మనసుకేమైంది
లోలోపల
వలపన్నది చెలరేగే అలా
ఎదలోన దాగుండిపోదే ఎలా
జడివానలా వచ్చి తడిపేయవా
ప్రియా అంటూ ప్రేమార పిలిచేయవా
నీవైపే ఎద లాగిందని
నీ చూపే అది కోరిందని
చెలీ నీకు తెలిశాక చెలగాటమా॥॥
Watch Some more songs from this movie:

Mona Mona
Rama Rama

Listen all songs:
SivamaNi (Or)
SivamaNi