Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

valapulOni chilipitanam - వలపులోని చిలిపితనం

చిత్రం : తోడూ-నీడ(tODu - nIDa) (1965)

రచన : ఆచార్య ఆత్రేయ
గానం : పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి
సంగీతం : కె.వి.మహదేవన్

పల్లవి :
వలపులోని చిలిపితనం ఇదేలే
నీ చెలిమిలోని గట్టిచిక్కు అదేలే॥
చరణం : 1
కన్నులకి అల్లరి నేర్పినది ఎవ్వరు
మనసులోన జొరబడిన
మగసిరికల ధీరుడు
అంత ధీరుడీనాడు ఏమైనాడు (2)
నీ ఇంత గుండెలోన ఇమిడిపోయినాడు(2)॥
చరణం : 2
తెలిసీ తెలియని మనసు
తెరిచినది ఎవ్వరు
లోనికి రాగానే మూసినది ఎవ్వరు
ఎవ్వరు...
తీయని కలలను తినిపించినదెవ్వరు
తీయని కలలను తినిపించినదెవ్వరు
తినిపించి చిటికెలోన ఓడించినదెవ్వరు(2)॥
చరణం : 3
చలివేసే వేళలో వేడైనది ఎవ్వరు
వేడైన విరహంలో తోడైనదెవ్వరు
నాలోన ఉండి నాకు నీడైనది ఎవ్వరు
నాలోన ఉండి నాకు నీడైనది ఎవ్వరు
తోడునీడగా ఉండి దోచినది ఎవ్వరు॥

atta odi puvvuvale - అత్త ఒడి పువ్వువలె

చిత్రం : తోడూ-నీడ(tODu - nIDa) (1965)

రచన : ఆచార్య ఆత్రేయ
గానం : పి.సుశీల
సంగీతం : కె.వి.మహదేవన్

పల్లవి :
అత్త ఒడి పువ్వువలె మెత్తనమ్మా
ఆదమరచి హాయిగా ఆడుకోమ్మా॥
ఆడుకొని పాడుకొని అలసిపోతావా (2)
అలుపుతీర బజ్జోమ్మ అందాల బొమ్మ॥
చరణం : 1
అమ్మలు కన్నుల్లో తమ్మిపూవుల్లు (2)
తమ్మిపూవులు పూయు తలిరు వెన్నెల్లు
తమ్మిపూవులు పూయు తలిరు వెన్నెల్లు
ఆ వెన్నెలను మూసెనే కన్నీటి జల్లు
వెన్నెలను మూసెనే కన్నీటి జల్లు
కన్నీరు రానీకు కరుగునెడదల్లు
చరణం : 2
కనిపించే దేవుళ్లు కమ్మని పాపల్లు (2)
కనిపించే తల్లికి కన్నుల జ్యోతుల్లు (2)
వేయాలి పాపాయి తప్పటడుగులు (2)
చేయాలి ఆపైన గొప్ప చేతలు॥

maLlunnA mAnyAlunnA - మళ్లున్నా మాన్యాలున్నా

చిత్రం : తోడూ-నీడ(tODu - nIDa) (1965)

రచన : ఆచార్య ఆత్రేయ
గానం : ఘంటసాల, పి.సుశీల
సంగీతం : కె.వి.మహదేవన్
పల్లవి :
మళ్లున్నా మాన్యాలున్నా
మంచెమీద మగువుండాలి
పాడి ఉన్నా పంటలు ఉన్నా
పంచుకునే మనిషుండాలీ ॥
చరణం : 1
పైరుమీద చల్లని గాలీ
పైటచెరగు నేగరేయాలీ (2)
పక్కనవున్న పడుచువానికి పరువం
ఉరకలు వేయాలి (2)॥
చరణం : 2
ఏతమెక్కి గెడవేస్తుంటే
ఎవరీ మొనగాడనుకోవాలీ
ఎవరీ మొనగాడనుకోవాలీ...॥
వంగి బానను చేదుతు ఉంటే
ఒంపుసొంపులు చూడాలి (2)
ఒంపుసొంపులు చూడాలి ॥
చరణం : 3
కాలు దువ్వి కోవెల బసపడు
ఖంగుమనీ రంకెయ్యాలీ (2)
జడవనులే మావారున్నారు వారి ఎదలో
నేనుంటాను (2)॥