Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

మారాలంటే లోకం...
మారాలంటా నువ్వే...
వీచే గాలి అందరికోసం
వాన మేఘం దాచుకోదు తనకోసం
సూర్యకాంతి అందరికోసం
చంద్రజ్యోతి ఎరగదు ఏ స్వార్థం
ఒక్కరికైనా మేలు చేస్తే
లోకం అంతా మేలు జరిగేను
ఒక్కరికైనా హాని చేస్తే
లోకం అంతా హాని కలిగేను

నువ్వంటే లోకం నీ వెంటే లోకం
ఈ మాటే శ్లోకం సోదరా

మా తెలుగుతల్లికి మల్లెపూదండ (2)

సహనంలో గాంధీజీ...
సమరంలో నేతాజీ...

మారాలంటే లోకం...
మారాలంటా నువ్వే...
మా తెలుగుతల్లికి మల్లెపూదండ (2)

చిత్రం : కొమరం పులి (2010)
రచన : చంద్రబోస్
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : ఎ.ఆర్.రెహమాన్, బృందం

పల్లవి :
హాయి హాయి ఎంత హాయి
ముద్దు ముచ్చట్లు మురిపించెనోయి
మల్లెలాంటి మనసు పొంగేనులే
ఆహాఁ... అల్లిబిల్లి ఊసులాడే
హేహే... పెద్దబస్తీల గోరింక
మావంక తిరిగే
చిలక ఏమన్నది చేర రమ్మన్నది
స్నేహాలు మోహాలు
గోరింక సొమ్మన్నది

చరణం : 1
ఏ... ఆనాడు చేసేవు బాస
అనుబంధాల పెంచేవు ఆశ
ఇక ఈనాడు ఏనాడు నాతోడు నాజోడు ఓ రాజా నావాడు నీవే
హేహే... నీతోనే ఉంటాను
నీలోనే ఉంటాను
నిగనిగ సొగసుల నిలిచెదను
ఈ లోకమేమనుకోనీ
ఎదలో మెదిలే వెలిగే వలపు నేనే

చరణం : 2
హేహే... దోబూచులాడెను సొగసు
నను ఊరించసాగెను వయసు
ఇక నీ ఇంపు నీ సొంపు నీ నీటు
నీ గోటు రాగాలు భోగాలు నావే
హేహే... నా నోము పండేను
నీ మోజు తీరెను
నవ్వుల పువ్వులు మన కలలు
ఈ లోకమేమనుకోనీ
ఇలలో కలలో ఎడమే మనకు లేదు

చిత్రం : చైర్మన్ చలమయ్య (1974)
రచన : ఆరుద్ర
సంగీతం : సలీల్ చౌధురి
గానం : ఎస్.జానకి, రామకృష్ణ


పల్లవి :
ఎందుకమ్మ ప్రేమ ప్రేమ
గుండెలోనె ఆగేవమ్మా రా...
సందె వేళ అయ్యిందమ్మా
సంతకాలు చెయ్యాలమ్మా రా...
వెంట వెంటనే అన్నీ అందుకోగరా జంట వింతలే ఎన్నో చూసుకోగరా
ఎందుకమ్మ...

చరణం : 1
నిన్ను నన్ను దూరం చేసే చెయ్యి లేదనీ
నీకు నాకు చేరువ పెంచే చూపు ఉందనీ
నిన్ను నన్ను...

చాటుమాటులో సరసం చాలదీ పని
గోటి రాతలే కవితై నీకు తోచనీ
తెలిపేందుకు వస్తున్నా
తెలిసిందని కనుగొన్నా
కొరికేసే కల నువ్వై రారా... హహ్హా...
ఎందుకమ్మ....

చరణం : 2
చిన్న చోటులోనె అందే పెద్ద హాయిని
ఆడుతున్న ఇద్దరు గెలిచే వింత ఆటని
చిన్న...

పొందకుంటే ఈ మాత్రం
జన్మ ఎందుకో
ఆడకుంటే ఈ ఆత్రం ఇక్కడెందుకో
అడగాలని అనుకున్నా
అటు నీ కసి కనుగొన్నా
ఇది నీదే ఇక ఏదేమైనా... హాహాహా...
ఎందుకమ్మ...
--------------------------------------
చిత్రం : గాయం-2 (2010)
రచన : అనంత శ్రీరామ్
సంగీతం : ఇళయరాజా
గానం : శ్రీరామ్ పార్థసారథి, గీతా మాధురి