Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

gAlilO gAlilO - గాలిలో... గాలిలో...

చిత్రం : కలిమిలేములు (1962)
రచన : మల్లాది రామకృష్ణశాస్ర్తి
సంగీతం : అశ్వత్థామ
గానం : ఘంటసాల, ఎస్.జానకి

పల్లవి :
గాలిలో... గాలిలో...
తేలే పూలడోలలో... డోలలో...
పన్నీరు జల్లే వెన్నెల తీవ
కన్నుల కలకల ఏమో
చిననాటి ఆనందసీమలో...
అలనాటి ఆనందసీమలో
అదే చెలిమిగ విహరించేయమని
అనుకున్న కన్నె కలలే
చిననాటి ఆనందసీమలో...

చరణం : 1
గాలిలో... గాలిలో...
అలారుగ... అలారుగ...
గాలిలో అలలు అలలుగ అలారుగ
గానమేలే కనకవీణ
నగుమోమున తళతళ ఏమో
చిననాటి ఆనందసీమలో...

చరణం : 2
అలనాటి కలల వేడుకలే
మనసైన వాని చేరువచేయ
మోదములో ఆదమరచే పరవశమే
చిననాటి ఆనందసీమలో...

చరణం : 3
గగనాన వెలిగే రేరాజు
చెంగల్వకు కలకాలము చేరువె
ఆ పలుకే నిజమై ఆ మనసే తనదై
కన్నెవలపు మాయని
పున్నమి వెలుగాయే
చిననాటి ఆనందసీమలో...

Comments