Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

Featured Post

ivvu ivvu okka muddu - ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు

పల్లవి : ఇవ్వు ఇవ్వు ఒక్క ముద్దు
ఇవ్వలేంది అడగవద్దు ॥
వద్దు వద్దు అంటూ పోతే చిన్నదానా
ఎప్పుడంట ఇచ్చేదంటా
కన్నెముద్దు ఇచ్చుకుంటే చిన్నవాడా
పెళ్లిదాకా ఆగవంటా
కళ్ళతోటే పెళ్లయింది చాల్లే
॥ చరణం : 1

ఆద్యంతమూ లేని
అమరానందమే ప్రేమ
ఏ బంధమూ లేని
తొలి సంబంధమే ప్రేమ
ప్రేమ దివ్యభావము
ప్రేమ దైవరూపము
ప్రేమ జీవరాగము
ప్రేమ జ్ఞానయోగము
మనసున పారే సెలయేరు ప్రేమ
అలసట తీర్చే చిరుగాలి ప్రేమ
హద్దులేవీ లేనిది అందమైన ప్రేమ
॥ చరణం : 2

ఓ అల్లరి ప్రేమ ఇక ఆడించకు నన్ను
ఓ టక్కరి ప్రేమ ఇక లాలించకు నన్ను
నీకు నేను సొంతము
నాకు నీవు సర్వము
నీవు నాకు దేహము
నేను నీకు ప్రాణము
ప్రతిరోజూ నీ ఉదయాన్ని నేను
ప్రతిరేయీ నీ నెలవంక నేను
జన్మలెన్ని మారినా ప్రేమ పేరు ప్రేమే


చిత్రం : ప్రేమ (1988)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : ఇళయరాజా
గానం : ఎస్.పి.బాలు, చిత్ర

Comments