Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

Featured Post

nI ASa aDiyASa - నీ ఆశ అడియాశ

పల్లవి :
నీ ఆశ అడియాశ
చెయిజారే మణిపూస
బ్రతుకంతా అమావాస
లంబాడోళ్ళ రాందాసా
ఆశ....

చరణం : 1
ఓ... తలచినది ఒకటైతే
జరిగినది వేరొకటి (2)
చితికినది నీ మనసు
అతుకుటకూ వేరెవరు
ఆశ....

చరణం : 2
గుండెలలో గునపాలు
గుచ్చారే నీవాళ్లు (2)
కన్నులలో గోదారి కాలువలే కట్టింది
ఆశ....

చిత్రం : యం.ఎల్.ఎ. (1957)
(దర్శకత్వం-నిర్మాత : కె.బి.తిలక్)
రచన : ఆరుద్ర
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
గానం : ఘంటసాల, ఎస్.జానకి

Comments