Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : శక్తి (2001)
రచన : రామజోగయ్యశాస్ర్తి
సంగీతం : మణిశర్మ
గానం : రంజిత్, బృందం


పల్లవి :
శక్తి... ఓం శక్తి...
తాలియా తాలియా తాలియా తాలియా దే
ఆగయా ఆగయా ఆగ యా మై ఆగయారే

నేనొస్తే జాతర నా మాటే మోతరా
బ్రహ్మాండం బద్దలేరా
పొగరే నా ఆస్తిరా పవరెంతో జాస్తిరా
మీకేం డౌటొద్దులేరా
నేనో మిస్సైలురా స్పీడే నా స్టైలురా
దమ్ముంటే పట్టుకోండిరా
నేనో బుల్లెట్టురా రైరై రాకెట్టురా
నాకే జైకొట్టుకోండిరా...

చరణం : 1
లోక్లాసు కుర్రాడనీ ఎవడంటే మనకేంటిరా
నేల క్లాసే నా బేసురా
దిల్ హై మేరా హైక్లాసురా
చిన్నోడే అనిపిస్తారా సింగంలా దూకేస్తారా
అమ్మతోడు...
అమ్మతోడు నా దారిలో చిమ్మచీకటి నరికేస్తారా
దుర్గమ్మ అంశతో పుట్టానురా
రామయ్య రక్షతో పెరిగానురా
కోట్లల్లో ఒక్కడై నిలవాలిరా
కాలం నా కథలన్నీ చదవాలిరా
అనుకుంటే సోదరా అన్నీ అవుతాయిరా
మనసుంటే మార్గముందిరా
నేనో బుల్లెట్టురా రైరై రాకెట్టురా
నాకే జైకొట్ట్టుకోండిరా... ॥

చరణం : 2
గురిపెడితే నాలో బలం అదరాలి కుంభస్థలం
పట్టుబడితే నా పౌరుషం అంబరాలే నా కైవసం
తొడగొడితే నా యవ్వనం
బెదరాలి సమరాంగణం
నన్ను గెలిచే... నన్ను గెలిచే దుస్సాహసం
చెయ్యలేదు ఏ మగ మీసం
ఎక్కే ప్రతిమెట్టుపై నా సంతకం
చేస్తూ వెళుతోందిరా ఈ జీవితం
ఈ దమ్ము ధైర్యమే ఓ ఇంధనం
నన్నే నే నమ్మడం నా లక్షణం
నాకే నే బాసురా నేనంటే మాసురా
నా తాకిడి తట్టుకోండిరా
నేనో బుల్లెట్టురా రైరై రాకెట్టురా
నాకే జైకొట్ట్టుకోండిరా...

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |