Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

endukO EmO tuLLi tirigenu - ఎందుకో ఏమో తుళ్లి తిరిగెను

చిత్రం : రంగం (2011)
రచన : వనమాలి
సంగీతం : హారీస్ జయరాజ్
గానం : ఆలాప్ రాజు, ప్రశాంతిని, బృందం

పల్లవి :
ఎందుకో ఏమో తుళ్లి తిరిగెను మనసే
పిచ్చి పరుగులు తీసే వెల్లి విరిసెను వయసే
ఎందుకో ఏమో గుండె దరువులు వేసే
కొంటె తలపులు తోచే పొంగి పొరలెను ఆశే
ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం
రేపో దరి కనని దరి కనని తీరం
ఏదో గజిబిజిగా గజిబిజిగా కనిపించే రూపం
రోజూ తడబడుతూ వెలిగే ఈ ఉదయం
ఎందుకో ఏమో కంట మెరుపులు మెరిసే
చేరి దూరమయ్యే వరసే రేయి కలలుగ విరిసే
ఎందుకో ఏమో రెక్కలెదలకు మొలిచే
చిన్ని గుండెనేదో తొలిచే ఒంటరిగా నను విడిచే ॥
నువ్వునేను ఒక యంత్రమా
కాలం నడిపే ఓ మహిమ ప్రేమ

చరణం : 1
ముద్దులిడిన ఊపిరి సెగలు
తగిలి రగిలి చెడిపోతున్నా
చెంత నువ్వు నిలబడగానే
నిన్ను విడిచి పరుగెడుతున్నా
సమీపానికొచ్చావంటే గుండెల్లో తుఫానే
అలా నన్ను రమ్మన్నావా అల్లాడిపోతానే
నవ్వుల్తో చంపే మాయే చాల్లే ॥॥

లెట్స్ గో... వావ్ వావ్
మీగర్లీ తెలుగమ్మాయి ఎందుకో ఏమో
యువర్ లుకింగ్ సో ఫ్లై
మరువనన్నది నా మది మరి మరి
నీ మనసే లవ్లీ చెప్పకనే చెప్పా
ప్రేమకు ఇద్దరి చూపులే వంతెన
లేడీ లుకింగ్ లైక్ సిండ్రెల్లా సిండ్రెల్లా
నాటీ లుక్కులిచ్చే ఈవేళ
లేడీ లుకింగ్ లైక్ సిండ్రెల్లా సిండ్రెల్లా
నన్ను చుట్టుముట్టే వెన్నెల ॥లుకింగ్‌॥

చరణం : 2
నిలవనీక నిను తెగ వెతికే
కనులకిన్ని తపనలు ఏంటో
ఎన్ని సడులు వినబడుతున్నా
వీడిపోదు నీ పలుకేంటో
కలల్లోన నిన్నే కనగా కన్నులనే పొందానో
కలే కల్లలయ్యే వేళ కన్నీరైపోతానో
నీడనే దోచే పాపే నేనో
ఏమో ఆల్‌రైట్ తుళ్లి తిరిగెను మనసే
పిచ్చి పరుగులు తీసే వె ల్లి విరిసెను వయసే
ఓహో ఏమో గుండె దరువులు వేసే
కొంటె తలపులు తోచే పొంగి పొరలెను ఆశే ॥

Comments