Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : ప్రేమించుకుందాం రా! (1997)
రచన : సిరివెన్నెల, సంగీతం : మహేష్
గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర


పల్లవి :
అలా చూడు ప్రేమలోకం పిలుస్తున్నది
కలే నేడు తీపి నిజమై ఫలిస్తున్నది
ప్రపంచమంతా దాటేద్దాం పద అన్నది
ప్రేమించుకుందాం రా నేస్తం
మన వయస్సు తపస్సు తరించు వరమిది ॥

చరణం : 1
ప్రతీ జన్మ నీతోనే ముడేశాడు బ్రహ్మ
అనే నమ్మి నీ పేరే జపించాను లేమ్మా
అదే పాట నా దాకా ఎలా చేరెనమ్మా
ప్రతిబాట నావైపే నిన్నే పంపెనమ్మా
నిరంత రం నీ ఊసేదో నను రమ్మన్నది
ప్రతీక్షణం నీ ధ్యాసేగా కలవరించి
వరించి రప్పించుకున్నది ॥

చరణం : 2
అలల్లాంటి ఈ రాగం నువ్వే నేర్పలేదా
తుఫానంటి ఈ వేగం నువ్విచ్చింది కాదా
వెలే వేసి లోకాన్ని ఎటో వెళ్లిపోదాం
ఎదో చేసి కాలాన్ని అలా ఆగమందాం
రహస్య రాజ్యం చేరే జత కథే ఇదీ
సుఖాల తీరం కోరే మన ప్రయాణమివాళ
ఫలించు క్షణమిది ॥

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |