Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

nErutunO lEdO prabhu - నేరుతునో లేదో ప్రభు

చిత్రం : పూజాఫలం (1964)
రచన : దేవులపల్లి కృష్ణశాస్త్రి
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
గానం : పి.సుశీల
నేడు సాలూరి రాజేశ్వరరావు జయంతి


పల్లవి :

నేరుతునో లేదో ప్రభు నీ పాటలు పాడ
ఇది చల్లని వేళైనా ఇది వెన్నెల రేయైనా
నిదురరాదు కనులకు శాంతిలేదు మనసుకు
మదిలో వేదన ఏదో కదలె రాధకు
ఇది చల్లని వేళైన...

చరణం : 1

నీ దయలాగున వెన్నెల జగమంతా ముంచె
నీ మధుర ప్రేమ యమున కడలంతా నించె
మరి మరి ముల్లోకములను మురిపించే స్వామీ
మనసు చల్లబడ దాసికి కనిపించవేమి...
ఇది చల్లని వేళైనా...

చరణం : 2

నీ వేణువు కోసం బ్రతుకంతా వీనులాయె
నీ దరిశనమునకై ఒడలంతా కనులాయె
బడలే బ్రతుకున ఆశలు వెలిగించే దేవా
సడలే వీణియ తీగలు సవరించి పోవా...
ఇది చల్లని వేళైనా ఇది వెన్నెల రేయైనా

Comments