Topics: Education (244) Maths (238) English (287) Science (74) Lyrics (870) Videos (850) Bollywood (32) Tollywood (71) Michael Jackson (154) IIT JEE (41)

edanu dOchi EdO chEsi - ఎదను దోచి ఏదో చేసి

చిత్రం : తెనాలి(tenAli) (2000)
రచన : వెన్నెలకంటి(vennelakaNTi)
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్(A.R.rehamAn)
గానం : ఎస్.పి.బాలు, కె.ఎస్.చిత్ర(S.P.bAlu,K.S.chitra)
30 November - నేడు వెన్నెలకంటి బర్త్‌డే

పల్లవి : ఎదను దోచి ఏదో చేసి
కళ్లనిండా కలలే దాచి ॥
చెంతకి చేరక ఊరించు వేళ
ప్రాణమా ప్రాణమా
ఎదనే నిదురించవా
ఎదురై మురిపించవా
పాటై పలికించవా తోడై పులకించవా॥
ప్రాణమా... ప్రాణమా... (2)॥
చెంతకి చేరక ఊరింతువేల
ప్రాయమా ప్రాయమా (2)
నన్ను చూసి నన్నే చూసి
కళ్లతోటి కలలే దోచి
తీయని మోహాల మరిగింతువేలా॥

చరణం : 1 కలిసిన కళ్లే కలలకు ఇళ్లై
వయసును గిల్లే మన్మధ విల్లై॥
హాయిగా ఊగే ఊయలలూగే
అందం ఎరవేసే చందమేదో సాగే
ఆశల గోదారి ఎగిసినదంటా
తారల పువ్వులన్నీ
కోసుకుందుమంటా
నిదురించు ప్రేమయే
ఉదయించె నేడే
నిదురించు ప్రేమయో ఉదయించె
నేడే...ప్రాణమా... ప్రాణమా...

చరణం : 2
హృదయాన మ్రోగే ఈ రాగహేల
మధురం కదా ఇక మన రాసలీల
రెక్కలు తొడిగే తలపులు చాలా
దిక్కులు దాటే ఎద ఈ వేళా
ఎదవీణ దాచే మౌన గీతమేలే
పున్నాగ విరుల సన్నాయి నీవే
జత నీవని నిన్నే వలచి వచ్చానే...
ప్రాణమా... ప్రాణమా...॥॥



Comments