Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

chaitramu kusumA~njali - చైత్రము కుసుమాంజలి

చిత్రం : ఆనందభైరవి(Anandabhairavi) (1984)
రచన : వేటూరి(vETUri)
సంగీతం : రమేష్‌నాయుడు(ramesh naidu)
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం(S.P.bAlasubrahmanyam)



పల్లవి :
చైత్రము కుసుమాంజలి... ఆ...
చైత్రము కుసుమాంజలి...
పంచమ స్వరమున ప్రౌఢకోకిలలు
నిసగ సగమ గమ
పసనిప మపగా
పంచమస్వరమున ప్రౌఢకోకిలలు
పలికే మరందాల అమృతవర్షిణి
పలికే మరందాల అమృతవర్షిణి
చైత్రము కుసుమాంజలి...
పమగస నిసగమ...
చైత్రము కుసుమాంజలి...
చరణం : 1
వేసవిలో అగ్నిపత్రాలు రాలి
విరహిణి నిట్టూర్పులా కొంతసాగి
గగగా దసనిదమగ సరిగా
దాద సాస గాగ మాద మదసా॥
జలద నినాదాల
పలుకు మృదంగాల (2)
వాసుక జలకన్యలా తేలి ఆడె
నర్తనకు కీర్తనకీ నాట్యకళాభారతికి
చైత్రము కుసుమాంజలి...
పమగస నిసగమ...
చైత్రము కుసుమాంజలి...
చరణం : 2
శయ్యలలో కొత్త ఒయ్యారమొలికే
శరదృతు కావేరీలా తీగసాగి
గగగా దసనిదమగ సరిగా
దాద సాస గాగ మాద మదసా॥
హిమజలపాతాల
సుమశర బాణాల (2)
మరునికి మర్యాదలే చేసి చేసి
చలిరుతువే సరిగమలౌ
నాదసుధామధువనికి
చైత్రము కుసుమాంజలి...
పమగస నిసగమ...
చైత్రము కుసుమాంజలి...


Special Note:
హాస్యబ్రహ్మగా పేరుపొందిన జంధ్యాలకు దర్శకునిగా ఇది తొమ్మిదవ చిత్రం.
ఈ చిత్రం ద్వారా జంధ్యాల ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు, ఉత్తమ ప్రాంతీయ చిత్ర దర్శకుడిగా జాతీయఅవార్డును అందుకున్నారు. కొండముది శ్రీరామచంద్రమూర్తి రచించిన ‘చిరుమువ్వల మరుసవ్వడి’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |