Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

nA jeevana jyOtivi - నా జీవనజ్యోతివి

చిత్రం : రగిలే జ్వాల (ragilE jwAla)(1981)
రచన : వేటూరి
సంగీతం : చక్రవ ర్తి
గానం : ఎస్.పి.బాలు, పి.సుశీల


పల్లవి :
నా జీవనజ్యోతివి నీవే
ఈ కోవెల హారతి నీవే
ఇహమై పరమై వరమై వెలగవే
//నా జీవనజ్యోతివి//
చరణం : 1
ఏ ప్రమిదలోన వెలిగావో
నా బ్రతుకు నీవుగా మిగిలావు
//నా జీవనజ్యోతివి//
ఏ దేవత కడుపున పుట్టావో
నా జన్మకు దీపం పెట్టావో
కదిలే శిలలో మమతే నీవులే
//నా జీవనజ్యోతివి//
చరణం : 2
నా నిదరే దేవుడికిచ్చాను
నా చూపులు కాపుగ చేశాను
ఆ దేవుడు ఇచ్చిన ఆయువునే (2)
నీకోసం ధారగ పోస్తాను
మదిలో మెదిలే బంధం నీదిలే
//నా జీవనజ్యోతివి//
చరణం : 3
నీ హృదయకాంతినే వెలిగించి
నను జ్యోతిగ నీవే చేశావు
//నీ హృదయ//
నీ వెలుగుకు నీడై పయనించి
నీ ప్రేమకు హారతి పడతాను
ఎదిగే రుణమే నిధిగా మిగలనీ
నా జీవనదాతవు నీవే
ఈ భువిలో దేవత నీవే
తల్లి తండ్రి గురువు నీవులే
నా జీవనజ్యోతివి నీవే...
నా జీవనదాతవు నీవే...
External LInk:

nA jeevana jyOtivi - నా జీవనజ్యోతివి

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |