nElanaDigA - నేలనడిగా
చిత్రం : ప్రియమైన నీకు(Priyamaina nIku) (2001), రచన : సిరివెన్నెలసంగీతం : శివశంకర్, గానం : ఎస్.పి.బాలు
08 January - నేడు తరుణ్ బర్త్‌డే (Tarun Birthday)
పల్లవి :
నీలి నింగి చుక్కలనడిగా ప్రేమించిన చెలి ఏదనీ
గాలినడిగా మబ్బులనడిగా
రామచిలక రెక్కలనడిగా క్షే మంగా ఉందా అని
ఐనా ఇంతవరకు ఆచూకి లేక
తెగిన గాలిపటమై తిరిగా ఎటో దారితోచక ఆగలేక
నా మనసు దోచిన ఆ ప్రేమా
ఏనాటికి చూపునో చిరునామా ॥
చరణం : 1
ఇపుడే ఇటు వెళ్లిందంటూ చిరుగాలి చెప్పింది
నిజమే ఇంకా గాలుందో చెలి పరిమళం ఉంది
ఇందాక చూశానంటూ సిరిమల్లె చెప్పింది
ఇదిగో అంటూ తనలో చెలి చిరునవ్వే చూపింది
ఈ గుడిగంటల్లో తన గాజుల సడి వింటుంటే
తను ఈ కోవెల్లో ఇప్పటివరకు ఉన్నట్టే
ఎటుచూసినా తన జాడలే ఎటువెళ్లిందో ఈ లోపునే॥
చరణం : 2
నడయాడే దీపంలాంటి ఆ రూపం చూస్తుంటే
కనుపాపల్లో కలకాలం కొలువుండిపోతుంది
నడకైన నాట్యంలాగే అనిపించే తన వెంటే
దివిలో ఉండే మెరుపే దిగి వచ్చిందనిపిస్తుంది
ఎందరో చూశారో కలగన్నామనుకున్నారో
అందుకనే ఏమో తను నిజం కాదనుకున్నారో
బతిమాలినా బదులివ్వదే
తను ఉందంటూ నను నమ్మరే ॥