Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

పది మందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే
విరి తోటలో పూలెన్ని పూచినా గుడికి చేరేది నూటికి ఒకటే ||పది మందిలో||

గోపాలునికి ఎంతమంది గోపికలున్న గుండెలోన నెలకొన్న రాధ ఒక్కటే
గోపాలునికి ఎంతమంది గోపికలున్న గుండెలోన నెలకొన్న రాధ ఒక్కటే
ఆకాశ వీధిలో తారలెన్ని వున్న అందాల జాబిల్లి అసలుఒక్కడే ||పది మందిలో||

ఏడారిలో ఎన్ని ఋతువులున్నను వేడుక చేసే వసంతమొక్కటే
ఏడారిలో ఎన్ని ఋతువులున్నను వేడుక చేసే వసంతమొక్కటే
నా కన్నులందు ఎన్ని వేల కాంతులున్నను
నా కన్నులందు ఎన్ని వేల కాంతులున్నను
ఆ కలిమి కారణం నీ ప్రేమ ఒక్కటే ||పది మందిలో||

చిత్రం : ఆనంద నిలయం
గానం : ఘంటసాల
రచన: ఆత్రేయ
సంగీతం:పెండ్యాల

In Youtube Song Sung By:Apparao Nagabhyru

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |