kanivini erugani - కనివిని ఎరుగని కరుణకు
చిత్రం : శాంతి సందేశం (SAnti sandESam)(2004)రచన : సుద్దాల అశోకతేజ(suddAla asOkatEja)
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్(vandEmAtaram SrInivas)
గానం : వందేమాతరం శ్రీనివాస్, ఉష(vandEmAtaram SrInivas,usha)
పల్లవి :
కనివిని ఎరుగని కరుణకు
నీవే ఆకారం తండ్రీ
నీవే ఆధారం తండ్రీ॥
దయామయా నీ చూపులతో
దావీదు తనయా నీ పిలుపులతో
మరణం మరణించే
మళ్లీ జీవము ఉదయించే (2)
నీ రూపము కనిపించే
హల్లెలూయ... హల్లెలూయ... (4)॥
చరణం : 1
నీ పద ధూళులు రాలిన నేలలు
మేమున్నామంటే
భాగ్యం ఉందా ఇంతకంటే ఆ...
చల్లని నీ చేతులు తాకి
పులకితమైపోయే
బ్రతుకే పునీతమైపోయే
కనులారా కంటిని నీ రూపం
మనసారా వింటిని నీ మాట
ఇది అపురూపం ఇది అదృష్టం
ఏమి చేసినామో పుణ్యం
మా జీవితాలు ధన్యం॥॥
చరణం : 2
మా కనురెప్పల పందిరిలో
నిను దాచుకుందుమయ్యా
నిత్యం కొలుచుకుందుమయ్యా
మా శుద్ధాత్మలు తివాసీలుగా
నీదు కాళ్ల కింద
ప్రేమగ పరచినాము ప్రభువా
ఇది చాలు మాకు ఈ జన్మకు
మము వీడి నీవు ఎటు వెళ్లకు
నీవె మా నేస్తం నీవె మా ప్రాణం
మా విశ్వాసమే నీవు
మా విశ్వానివి నీవు॥॥