ennO rAtrulostAyi - ఎన్నో రాత్రులొస్తాయి
చిత్రం : ధర్మక్షేత్రం(dharmakshEtram) (1992)రచన : వేటూరి, సంగీతం : ఇళయరాజా
గానం : ఎస్.పి.బాలు, చిత్ర
02 June - నేడు ఇళయరాజా బర్త్‌డే
పల్లవి :
ఎన్నో రాత్రులొస్తాయి గానీ
రాదీ వెన్నెలమ్మ
ఎన్నో ముద్దిలిస్తారు గానీ లేదీ వేడి చెమ్మ
అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు ఎన్నో
చరణం : 1
ఎన్ని మోహాలు మోసీ
ఎదలు దాహాలు దాచా
పెదవి కొరికే పెదవి కొరకే... ఓహోహో
నేనిన్ని కాలాలు వేచా ఇన్ని గాలాలు వేశా
మనసు అడిగే మరులు సుడికే... ఓహోహో
మంచం ఒకరితో అలిగిన మౌనం
వలపులే చదివినా
ప్రాయం సొగసులే వెతికినా సాయం
వయసునే అడిగినా ॥
చరణం : 2
గట్టి ఒత్తిళ్లు కోసం గాలి కౌగిళ్లు తెచ్చా
తొడిమ తెరిచే తొనల రుచికే... ఓహోహో
నీ గోటిగిచ్చుళ్ల కోసం మొగ్గ చెక్కిళ్లు ఇచ్చా
చిలిపి పనుల చెలిమి జతకే... ఓహోహో
అంతే ఎరుగనీ అమరిక
ఎంతో మధురమే బడలిక
ఛీ పో బిడియమా సెలవిక
నాకీ పరువమే పరువిక ॥
Special Note:
అసలు పేరు : డేనియల్ రాజయ్య
జననం : 2-6-1943
జన్మస్థలం : మదురైలోని పన్నైపురం గ్రామం
తల్లిదండ్రులు : చిన్నత్తాయమ్మాళ్, రామస్వామి
తోబుట్టువులు : అన్నయ్యలు (పావలర్ వరదరాజన్- రామ స్వామి మొదటి భార్య కొడుకు, డేనియల్ భాస్కర్), తమ్ముడు (గంగై అమరన్)
చదువు : 8వ తరగతి
భార్య : జీవా
పిల్లలు : కుమారులు (కార్తీక్‌రాజా, యువన్‌శంకర్‌రాజా), కుమార్తె (భవతారిణి) ( సంగీత దర్శకులు, గాయకులుగా రాణిస్తున్నారు)
సంగీత గురువు : జి.కె.వెంకటేష్
తొలిచిత్రాలు సంగీత దర్శకునిగా : తమిళం-అన్నకిళి (1976), తెలుగు-భద్రకాళి (1977)
గాయకునిగా : సీతాకోకచిలుకలో ‘అలలు కలలు ఎగసి ఎగసి...’ (తెలుగు)
సంగీత దర్శకునిగా చిత్రాలు : 850 పైగా
నటించిన సినిమాలు : పుదు పుదు అర్తంగళ్ (1989), అళగర్‌మలై (2009)
రాసిన పుస్తకాలు : తుళకడల్, పాల్ నిలాపాదై
అవార్డులు-పురస్కారాలు : గిటార్ సాధనలో ‘ట్రినిటీ మ్యూజిక్ ఆఫ్ లండన్’ వారి నుండి గోల్డ్‌మెడల్, జాతీయ అవార్డులు... తెలుగులో రెండు, తమిళ, మళయాళాలలో ఒక్కక్కటి, అన్నామలై, అరిజోనా వరల్డ్, మదురై కామరాజ్ యూనివర్సిటీల నుండి గౌరవ డాక్టరేట్లు, తెలుగులో మూడు నంది అవార్డులు. పద్మభూషణ్, ఇసై జ్ఞాని... బిరుదులు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుండి లతా మంగేష్కర్ అవార్డు, కలైమామణి, ఏపీ ప్రభుత్వం నుండి 2008 లో ఎన్‌టీఆర్ జాతీయ అవార్డు, తమిళనాడు ప్రభుత్వం నుండి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి పురస్కారం, మరెన్నో సంగీత అవార్డులు అందుకున్నారు.