Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : నిన్నేప్రేమిస్తా (2000)
రచన : వెనిగళ్ల రాంబాబు
సంగీతం : ఎస్.ఎ.రాజ్‌కుమార్
గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం


పల్లవి :
ఒక దేవత వెలసింది నీ కోసమే
ఈ ముంగిట నిలిచింది మధుమాసమే
ఒక దేవత వెలసింది నా కోసమే
ఈ ముంగిట నిలిచింది మధుమాసమే
సంధ్యాకాంతుల్లోన శ్రావణిలా
సౌందర్యాలే చిందే యామినిలా
ఎన్నో జన్మల్లోని పున్నమిలా
శ్రీరస్తంటూ నాతో అంది ఇలా
నిన్నే ప్రేమిస్తానని...॥దేవత॥

చరణం : 1
విరిసే వెన్నెల్లోన మెరిసే కన్నుల్లోన
నీ నీడే చూశానమ్మా
ఎనిమిది దిక్కుల్లోన నింగిని చుక్కల్లోన
నీ జాడే వెతికానమ్మా
నీ నవ్వే నా మదిలో అమృతవర్షం
ఒదిగింది నీలోనే అందని స్వర్గం
నునుసిగ్గుల మొగ్గలతో ముగ్గులు వేసి
మును ముందుకు వచ్చే నెచ్చెలినే చూసి
అంటుందమ్మా నా మనసే నిన్నే ప్రేమిస్తానని
॥దేవత॥

చరణం : 2
రోజా మొక్కలు నాటి ప్రాణం నీరుగ పోసి
పూయించా నీ జడకోసం
రోజూ ఉపవాసంగా హృదయం నైవేద్యంగా
పూజించా నీ జతకోసం
నీరెండకు నీ వెంటే నీడై వచ్చి
మమతలతో నీ గుడిలో ప్రమిదలు చేస్తా
ఊపిరితో నీ రూపం అభిషేకించి
ఆశలతో నీ వలపుకు హారతులిస్తా
ఇన్నాళ్లూ అనుకోలేదే నిన్నే ప్రేమిస్తానని
॥దేవత॥

Photo : వెనిగళ్ల రాంబాబు

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |