Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చాంగురే...చాంగురే బంగారు రాజా చాంగు చాంగురే బంగారు రాజా
మజ్జారే మగరేడా మత్తైన వగకాడా అయ్యారే!
నీకే మనసియ్యలని వుందిరా ||చాంగురే ||

ముచ్చటైన మొలక మీసముంది భళా అచ్చమైన సింగపు నడుముంది
జిగీ బిగీ మేనుంది సొగసులొలుకు మోముందిమేటి దొరవు అమ్మక చెల్ల
నీ సాటి ఎవ్వరునుండుట కల్ల ||చాంగురే ||

కైపున్న మచ్చకంటి చూపు అది చూపు కాదు పచ్చల పిడిబాకు
పచ్చల పిడిబాకో విచ్చిన పువురేకోగుచ్చుకుంటే తెలుస్తుందిరా
మనసిచ్చుకుంటే తెలుస్తుందిరా ||చాంగురే ||

గుబులుకొనే కోడెవయసులెస్స దాని గుబాళింపు ఇంకా హైలెస్సా
పడుచు దనపు గిలిగింత గడుసు గడుసు పులకింతఉండనీయవేమి సేతురా
కై దండలేక నిలువలేనురా ||చాంగురే ||

చిత్రం : శ్రీ కృష్ణ పాండవీయం
గానం : జిక్కీ
రచన : సి. నారాయణరెడ్డి
సంగీతం : పెండ్యాల

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |