ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో
ఈ బండల మాటున ఏ గుండెలు మ్రోగెనో ఒ... ||ఈ నల్లని రాలలో||
పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి
పాపాలకు తాపాలకు బహు దూరములోనున్నవి
మునులవోలె కారడవుల మూలలందు పడియున్నవి ||ఈ నల్లని||
కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు
కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు
ఉలి అలికిడి విన్నంతనే ఉలి అలికిడి విన్నంతనె
జల జలమని పొంగి పొరలు ||ఈ నల్లని||
పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును
పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును
జీవమున్న మనిషికన్న శిలలే నయమని పించును ||ఈ నల్లని||
చితం అమరశిల్పి జక్కన