Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

పల్లవి :
ఈ పగలు రేయిగా
పండు వెన్నెలగ మారినదేమి చెలీ
ఆ కారణమేమి చెలీ ఆ... ఊఁ..
వింతకాదు నా చెంతనున్నది
వెండి వెన్నెల జాబిలి
నిండు పున్నమి జాబిలి... ఓ ఓ ఓ...

చరణం : 1
మనసున తొణికే చిరునవ్వెందుకు
పెదవుల మీదికి రానీవు
అహా ఓహో అహా... ఆ...

పెదవి కదిపితే మదిలో మెదిలే మాట తెలియునని మానేవు ఊఁ...


చరణం : 2
కన్నులు తెలిపే కథలనెందుకు
రెప్పలార్చి ఏమార్చేవు
ఆఁ... ఆఁ... ఓ ఓ ఓ...

చెంపలు పూచే కెంపులు
నాతో నిజము తెలుపునని జడిసేవు
ఓహోహో...


చరణం : 3
అలుక చూపి అటువైపు తిరిగితే
అగుపడదనుకుని నవ్వేవు ఉహుహు...

నల్లని జడలో మల్లెపూలు
నీ నవ్వునకద్దము చూపేను ఆహా...

ఆహహాహా... ఆహహాహా...
ఆహహాహా... ఆహహాహా...
ఊహుహూ...

చిత్రం : సిరిసంపదలు (1962)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : మాస్టర్ వేణు
గానం : ఘంటసాల, ఎస్.జానకి

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |