పల్లవి :
గురువంటే గుండ్రాయి కాదు
బుడుగంటే బుడిచెంబు కాదు
॥
ఆడాలి గెలవాలి చదవాలి ఎదగాలి (2)
మనసులు విరబూసి
మధువులు చిందాలి
॥
చరణం : 1
పురాణాలు వేదాలు
రామాయణ భారతాలు (2)
కథలెన్నీ వర్ణించినా
హితమెంత బోధించినా
దోషిని దండించమని
ద్రోహిని ఎదిరించమని
స్వార్థాన్ని పక్కకునెట్టి
మానవతను పెంచమని
ఎలుగెత్తి చాటాయి...
పరోపకారం పుణ్యం
పరహింసనమే పాపం (2)
॥
చరణం : 2
విభేదాలు వైరాలు
కులమత విద్రోహాలు (2)
వివరించే నీతి ఒక్కటే...
సూచించే సూత్రమొక్కటే...
మంచికి విలువీయకుంటే
వంచన విడనాడకుంటే
మతసహనం మాటమరచి
సమతకు తను సమాధికడితే
నరుడే దానవుడవుతాడు
అసతోమా సద్గమయ
తమసోమా జ్యోతిర్గమయ
॥॥
చిత్రం : హైహై నాయకా (1989)
(దర్శకత్వం : జంధ్యాల)
రచన : ముళ్ళపూడి శాస్ర్తి
సంగీతం : సురేశ్‌చంద్ర (మాధవపెద్ది సురేష్)
గానం : బాలు, మంజునాథ్