పల్లవి : హ్యాపి హ్యాపి బర్త్డేలు
మళ్లి మళ్లి చేసుకోగ
శుభాకాంక్షలందజేయమా మిత్రమా
ఆపలేని స్వేచ్ఛ ఉంది
అందినంత ఛాన్సు ఉంది
అందుకోర పుత్ర రత్నమా నేస్తమా
జీవితానికే అర్థం ప్రేమని
మరిచిపోదు మా యవ్వనమే
ప్రేమ అన్నదే సర్వం కాదని
చాటుతుంది మా అనుభవమే
చిలిపి వ యసు వరస తమకు తెలియద
హ్యాపి హ్యాపీ... ఓ... ఓ... ॥
చరణం : 1 తెలియకడుగుతున్నాలే
కంప్యూటరేమంటోంది
పాఠమెంత అవుతున్నా
ఫలితం ఏమైంది
బోధపడని కంప్యూటర్
బదులన్నదే లేదంది
విసుగురాని నా మనసే
ఎదురే చూస్తోంది
ప్రేమకథలు ఎప్పుడైన ఒకటే ట్రెండ్
ఆచితూచి ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్
అప్టుడేటు ట్రెండు మాది టోటల్ చేంజ్
పాత నీతులింక మాకు నో ఎక్స్ఛేంజ్
ఫ్రెండులాంటి పెద్దవాడి
అనుభవాలసారమే
శాసనాలు కావు నీకు
సలహాలు మాత్రమే
కలను వదలి ఇలను తెలిసి నడుచుకో
॥హ్యాపి॥
చరణం : 2 నింగిలోని చుక్కలనే
చిటికేసి రమ్మనలేమా
తలచుకుంటే ఏమైనా ఎదురేలేదనమా
నేల విడిచి సామైతే
టైం వేస్టురా ఈ ధీమా
ముందు వెనుక గమనిస్తే
విజయం నీది సుమా
రోజా నవ్వు రమ్మంటున్న రోజు కదా
తాకకుండ ఊరుకుంటె తప్పు కదా
నవ్వు కింద పొంచి ఉన్న ముళ్ళు కదా
చూడకుండ చెయ్యి వేస్తే ఒప్పు కదా
ముళ్ళు చూసి ఆగిపోతే
పువ్వులింక దక్కునా
లక్ష్యమందకుండ
లైఫుకర్థమింక ఉండునా
తెగువ తెలుపు గెలుపు మనకి దొరకగ
॥హ్యాపి॥
చిత్రం : సుస్వాగతం (1998)
రచన : సామవేదం షణ్ముఖశర్మ
సంగీతం : ఎస్.ఎ.రాజ్కుమార్
గానం : మనో, జయచంద్రన్, మణికిరణ్