Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

పల్లవి :
హాయి హాయి ఎంత హాయి
ముద్దు ముచ్చట్లు మురిపించెనోయి
మల్లెలాంటి మనసు పొంగేనులే
ఆహాఁ... అల్లిబిల్లి ఊసులాడే
హేహే... పెద్దబస్తీల గోరింక
మావంక తిరిగే
చిలక ఏమన్నది చేర రమ్మన్నది
స్నేహాలు మోహాలు
గోరింక సొమ్మన్నది

చరణం : 1
ఏ... ఆనాడు చేసేవు బాస
అనుబంధాల పెంచేవు ఆశ
ఇక ఈనాడు ఏనాడు నాతోడు నాజోడు ఓ రాజా నావాడు నీవే
హేహే... నీతోనే ఉంటాను
నీలోనే ఉంటాను
నిగనిగ సొగసుల నిలిచెదను
ఈ లోకమేమనుకోనీ
ఎదలో మెదిలే వెలిగే వలపు నేనే

చరణం : 2
హేహే... దోబూచులాడెను సొగసు
నను ఊరించసాగెను వయసు
ఇక నీ ఇంపు నీ సొంపు నీ నీటు
నీ గోటు రాగాలు భోగాలు నావే
హేహే... నా నోము పండేను
నీ మోజు తీరెను
నవ్వుల పువ్వులు మన కలలు
ఈ లోకమేమనుకోనీ
ఇలలో కలలో ఎడమే మనకు లేదు

చిత్రం : చైర్మన్ చలమయ్య (1974)
రచన : ఆరుద్ర
సంగీతం : సలీల్ చౌధురి
గానం : ఎస్.జానకి, రామకృష్ణ

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |