Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

పల్లవి : కలగనే కన్నుల్లో కరగకే కన్నీరా
కలసిన గుండెల్లో కలతలే కన్నారా
నిన్న మొన్న నీడల్లే
నీతో ఉన్న సందెల్లే
ఈ వెతలుగ చెలరేగేనా
నాతో సాగే స్నేహం
నాలో రేపే శోకం
శాపంలాంటి దూరం
చూపించేనా తీరం ॥

చరణం : 1
ఏనాటిదో అనురాగం
ఈనాడిలా పెనవేసే
పాదం సాగే ప్రతిచోట
పాశం తానే అడుగేసే
మనసే మురిసే మలుపులలోన
వెతలే రగిలే ఎద లయలోన
మదిని వీడని మమతిదియని
మరి మరి ముడిపడగా ॥

చరణం : 2
గాయం మాన్పే చెలిమేదో
కాలం ఇలా కలిపేనా
గమ్యం చేరే తరుణాన
గాలి వాన ఉరిమేనా
ఒడిని వెతికే సమయములోన
ధరణి కనని మది కుమిలేనా
వలచిన కథ వరము అవ్వనీ
చెరగని గురుతులుగా ॥

చిత్రం : గాయం-2 (2010)
రచన : వనమాలి
సంగీతం, గానం : ఇళయరాజా

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |