Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

పల్లవి :
కిళిమాంజారో భళ భళిమాంజారో
కథకళిమాంజారో యారో యారో...
ఆహా ఆహా... ఆహా ఆహా...
మొహంజోదారో నువు అహంజాదారో
రావే షెహెంజాదారో
యారో యారో...
చుట్టూ చూసి ఒట్టే వేసి కళ్ళతోటే కొరికై
ముద్దులతోటి వెచ్చ పెట్టి
సిగ్గు పండు ఒలిచై
పెద్ద పాము మళ్లై వచ్చి
పిల్ల జింకను పట్టై
శొంఠి మిరియంతోటే నన్ను
సూప్ మల్లే తాగై
ఈవ్‌గారి చిట్టి చెల్లి నాకాడుంది తెలుసా
ఆరడగుల ఆలీవ్‌పండు
అప్పగించై చిలక
కొక్కొక్కో అంది గిన్నెకోడి
చెక్కచెక్కక్కో ఎంత వన్నెలాడి
ఒక్కొక్కో ముద్దు ఎంచుకోండి
ఎంచుకోండి...

చరణం : 1
నెర పచ్చావే గిరి గచ్చావే
ఎరుపెక్కినా దొరబుచ్చీవే
అరె నూరుకోట్ల జనం ఒక్కటైనా
నీకు పోటీ కానం
ఇటు ఒక్కటే అటు ఒక్కటే
విడితే గుట్టు మనమొక్కటే
నా సోకు పళ్లే తిని వెన్ను పట్టి
ఆరబెట్టై హనీ
వేళ్లని కుదిపే వర్షం నేను
తొలకరినై వచ్చా
పెదవితో పెదవికి తాళం వేసి
ఒక యుగం ముగించెయ్
గడుసు అబ్బాయి

చరణం : 2
మర వీరుడా వలచానురా
కురవంజితో చెయ్ భాంగడా
నువుదారికొస్తే భళ రెచ్చగొట్టి
కానుకిస్తా ఇలా
మదమెక్కినా మొనగత్తెనోయ్
పొదచాటున పడగొట్టేసెయ్
అరె నూరు గ్రాము నీ నడుం
పుంజునై దోచుకుంటా నిజం
తేటగ ఉన్న దూటనయో
నను నోటబెట్టై మొత్తం
పచ్చని పసిరిక నీవైతే పులి గడ్డే
తినదా అనుదినం
చిత్రం : రోబో (2010)
రచన : భువనచంద్ర
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : జావెద్ అలీ, చిన్మయి

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |