Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

చిత్రం : రాము
రచన : దాశరధి
సంగీతం:అర్.గోవర్ధన్
గానం : ఘంటసాల

మంటలు రేపే నెలరాజ
ఈ తుంటరి తనము నీకేలా
వలపులు రేపే విరులారా
ఈ శిలపై రాలిన ఫలమేలా

ఆకాశానికి అంతుందీ
నా ఆవేదనకు అంతేదీ
ఆకాశానికి అంతుందీ
నా ఆవేదనకు అంతేదీ
మేఘములోనా మెరుపుంది
నా జీవితమందున్న వెలుగేది
||మంటలు||

తీగలు తెగిన వీణియపై
ఇక తీయని రాగం పలికేనా
తీగలు తెగిన వీణియపై
ఇక తీయని రాగం పలికేనా
ఇసుక ఎడారిని ఎపుడైనా
ఒక చిన్న గులాబి విరిసేనా
||మంటలు||

మదిలో శాంతిలేనపుడు
ఈ మనిషిని దేవుడు చేసాడు
సుఖము శాంతి ఆనందం
నా నొసటను రాయటము మరిచాడు.||మంటలు||

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |