Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

మాటంటే మాటేనంట
కంటపడ్డ నిజమంతా అంటా
ౠజువంటూ దొరికిందంటే
గంట కొట్టి చాటేస్తూవుంటా

నిజమంటే తంటాలంటా
నిక్కుతుంటె తిక్క దిగుతాదంటా
మొదలంటూ పెడతావంటా
వెంటబడి తెగ తంతారంట

గోపీ నా పక్కనుంటే భయమింకా ఎందుకంటా
ఎవరంటే నాకేవంటా తప్పులుంటె ఒప్పనంటా

నీవెంటే నేనువుంటా
చూస్తుంటా ఓరకంట
నిజమంటూ నీలుగుతుంటే
ముప్పు నీకు తప్పదంటా

(జనక్ జుమ్మా..)

మాటంటే మాటేనంట
కంటపడ్డ నిజమంతా అంటా
మొదలంటూ పెడతావంటా
వెంటబడి తెగ తంతారంట

నువ్వే మా మొదటి గెష్టని
మా ఆవిడ వంట బెష్టని
ఈ ఫీష్టుకి పిలుచుకొస్తిని..టేష్టు చెప్పి పోరా

ఇదే మా విందు భోజనం
మీరే మా బంధువీదినం
రుచుల్లో మంచి చెడ్డలు ఎంచి తెలుపుతారా

అపార్ధం చేసుకోరుగా
అనర్ధం చెయ్యబోరుగా
యదార్ధం చేదుగుంటదిపదార్ధం చెత్తగున్నది

ఇది విందా నా బొందాతిన్నోళ్ళూ గోవిందా
జంకేది లేదింక నీ టెంక పీకెయ్యక.. పదరకుంకా

నిజమంటే తంటాలంటా
నిక్కుతుంటె తిక్క దిగుతాదంటా
మొదలంటూ పెడతావంటా
వెంటబడి తెగ తంతారంట

గోపీ నా పక్కనుంటే భయమింకా ఎందుకంటా
ఎవరంటే నాకేవంటా తప్పులుంటె ఒప్పనంటా

నిజమంటే తంటాలంటా
నిక్కుతుంటె తిక్క దిగుతాదంటా
ౠజువంటూ దొరికిందంటే
గంట కొట్టి చాటేస్తూవుంటా

భళారే నీలి చిత్రమా
భలేగా వుంది మిత్రమా
ఇలా రస యాత్ర సాగదా పక్కనుంటె భామా

కోరావు అసలు ట్రూతును
చూపాను సిసలు బూతును
చిక్కారు తప్పు చేసి ఇక మక్కెలిరగదన్ను

తమాషా చూడబోతిరా
తఢాఖా చూపమందురా
మగాళ్ళని ఎగిరి పడితిరామదించి మొదలు చెడితిరా

సిగ్గైనా ఎగ్గైనా...లేకుండా దొరికారాలా
కప్పు పైకప్పు మీ కిప్పుడే చూపుతా..బెండు తీస్తా

మాటంటే మాటేనంట
కంటపడ్డ నిజమంతా అంటా
ౠజువంటూ దొరికిందంటే
గంట కొట్టి చాటేస్తూవుంటా

నీవెంటే నేనువుంటా చూస్తుంటా ఓరకంట
నిజమంటూ నీలుగుతుంటే ముప్పు నీకు తప్పదంటా
(జనక్ జుమ్మా..)

మాటంటే మాటేనంట
కంటపడ్డ నిజమంతా అంటా
మొదలంటూ పెడతావంటా
వెంటబడి తెగ తంతారంట


నీవెంటే నేనువుంటా చూస్తుంటా ఓరకంట
నిజమంటూ నీలుగుతుంటే ముప్పు నీకు తప్పదంటా

(జనక్ జుమ్మా..)

మాటంటే మాటేనంట
కంటపడ్డ నిజమంతా అంటా
మొదలంటూ పెడతావంటా
వెంటబడి తెగ తంతారంట

SNAP Shot: ఈ పాటలో పల్లవి కి చివరగా "సున్నా, ట'
(మాటేనంట,అంటా, దొరికిందంటే, చాటేస్తూవుంటా)కావాలని
సినిమా దర్శకులు వంశీ, "సిరివెన్నెల" దగ్గరికి మొదట వెళ్ళి
అడుగగా..వారు రాయలేక పోతె, వెన్నెలకంటి గారిని అడిగారు...
ఆయన..5 నిముషాలలో వ్రాసిచ్చారు. దాని తరువాతే సీతారామ శాస్త్రీ గారు..
ఆ ప్రయోగాలు చేయటం మొదలు పెట్టారు..

చిత్రం: ఏప్రెల్ 1st విడుదల
రచన: వెన్నెలకంటి
సంగీతం: ఇళయరాజా
గాత్రం: S.P.బాలు

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |