సాకీ :
మీఠి మీఠి ధునువ బజాయే
రాధాకే మన్ కో లుభాయే
గోపీ బోలే గిరిధర్ నందలాల
నందలాల... మీఠి
పల్లవి :
పిలిచే పెదవులపైనా
నిలిచే మెరుపు నువ్వేనా
నువు చేరి న డి ఎడారి
నందనమై విరిసిందా
తనలో ఆనందలహరి
సందడిగా ఎగసిందా
నడిచిన ప్రతిదారి నదిగా మారి
మురిసినదా ముకుందా
కాలం నేను మరచి జ్ఞాపకాల్లో
జారిపోయిందా
లోకం గోకులంలా మారిపోయి
మాయ జరిగిందా
ఊరంతా ఊగిందా
నీ చెంత చేరిందా గోవిందా
చరణం : 1
ఈ భావం నాదేనా ఈనాడే తోచేనా
చిరునవ్వోటి పూసింది నా వల్లనా
అది నా వెంటే వస్తోంది ఎటు వెళ్లినా
మనసులో ముంచైనా మురిపించేనా
మధురమే ఈ లీల
నాలో ఇంతకాలం ఉన్న మౌనం
ఆలపించిందా
ఏకాంతాన ప్రాణం బృందగానం
ఆలకించిందా
జుమొ రె జుమొ రె జుమొ రె ఓ గిరిధర్
రె
యారో మురళి భజావే గిరిధర్ గోపాల
బజాకే మన్ కో చురాలే
గిరిధర్ నందలాల...
చరణం : 2
నా చూపే చెదిరిందా
నీ వైపే తరిమిందా
చిన్ని కృష్ణయ్య పాదాల సిరిమువ్వల
నన్ను నీ మాయ నడిపింది
నలువైపులా
అలజడి పెంచైనా అలరించైనా
లలనను ఈ వేళ
ఏదో ఇంద్రజాలం మంత్రమేసి
నన్ను రమ్మందా
ఎదలో వేణునాదం
ఊయలూపి ఊహ రేపిందా
చిత్రం : ఖలేజా (2010)
రచన : సీతారామశాస్ర్తి
సంగీతం : మణిశర్మ
గానం : హేమచంద్ర, శ్వేత