నడిరేయి ఏ జాములో స్వామి నిను చేర దిగివచ్చునో
తిరుమల శిఖరాలు దిగివచ్చునో
మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ
మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ
పతి దేవు ఒడిలోన మురిసేటివేళ
స్వామి చిరు నవ్వు వెన్నెలలు కురిసేటివేళ
విభునికి మా మాట వినిపించవమ్మా
పృభువుకు మా మనవి వినిపించవమ్మా
ఏడెడు శిఖరాలు నే నడువలేనుఏ పాటి కానుక లందించలేను
వెంకన్న పాదాలు దర్శించలేనునేను వివరించి నా బాధ వినిపించలేను
అమ్మా మము గన్న మాయమ్మా అలివేవుమంగా
కలవారినేగాని కరుణించలేడా నిరుపేద మొరలేవి వినిపించుకోడా
కన్నీటి బృఅతుకుల కనలేనివాడుస్వామి కరుణా మయుండన్నా బిరుదేలనమ్మా
అడగవె మా తల్లి అనురాగ వల్లిఅడగవె మాయమ్మ అలివేలుమంగా
చిత్రం:రంగులరాట్నం
గానం :బాలసుబ్రమణ్యం,జానకి