Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

పల్లవి :
నిదురపో... నిదురపో... నిదురపో (2)
నిదురపోరా తమ్ముడా (2)
నిదురలోన గతమునంతా
నిముషమైనా మరచిపోరా
కరుణలేని ఈ జగాన
కలత నిదురే మేలురా
నిదురపోరా తమ్ముడా... ఆ...

చరణం : 1
కలలు పండే కాలమంతా
కనుల ముందే కదలిపోయే... ఆ...
లేత మనసుల చిగురుటాశ
పూతలోనే రాలిపోయే
నిదురపోరా తమ్ముడా... ఆ...

చరణం : 2
జాలి తలచి కన్నీరు తుడిచే
దాతలే కనరారే...
చితికిపోయిన జీవితమంతా
చింతలో చితియాయె
నీడచూపె నెలవు మనకు
నిదురయేరా తమ్ముడా
నిదురపోరా తమ్ముడా (2)

చిత్రం : సంతానం (1955)
రచన : అనిసెట్టి
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి
గానం : లతామంగేష్కర్

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |