నిను చూడక నేనుండలేను
నిను చూడక నేనుండలేను
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఇక యే జన్మకైన ఇలాగే ||నిను||
యే హరివిల్లు విరబూసినా
నీ దరహాసమనుకొంటినీ
యే చిరుగాలి కదలాడినా
నీ చరణాల సృతి వింటినీ
నీ ప్రతి రాకలో ఎన్ని శశి రేఖలో
నీ ప్రతి రాకలో ఎన్ని శశి రేఖలో ||నిను||
నీ జత కూడి నడయాడగా
జగమూగింది సెలయేరుగా
ఒక క్షణమైన నిను వీడినా
మది తొణికింది కన్నీరుగా
మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం
మన ప్రతి సంగమం ఎంత హృదయంగమం
చిత్రం : నీరాజనం
సంగీతం:ఓ.పి.నయ్యర్
గానం :ఎస్.పి.బాలసుబ్రమణ్యం,జానకి