Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

నీవు లేక వీణ పలుక లేనన్నది
నీవు రాక రాధ నిలువ లేనన్నది ఆ ఆ ||నీవు లేక వీణ||

జాజి పూలు నీకై రోజు రోజు పూచే
చూసి చూసి పాపం సోమ్మసిల్లి పోయే
చందమామ నీకై తోంగి తోంగి చూసి
చందమామ నీకై తోంగి తోంగి చూసి
సరసను లేవని పలుకలు బోయే ||నీవు లేక వీణ||

కలలనైన నిన్ను కనుల చూపమన్న
నిదుర రాని నాకు కలలు కూడ రావే
కదల లేని కాలం విరహ గీటి రీతి
కదల లేని కాలం విరహ గీటి రీతి
పరువము వ్రుధగ బరువుగ సాగే ||నీవు లేక వీణ||

తలుపులన్ని నీకై తెరచి వుంచి నాను
తలపులెన్నో మదిలో దాచి వేచి నాను
తాపమింక నేను ఓపలేను స్వామి
తాపమింక నేను ఓపలేను స్వామి
తరుణిని కరునను యేలగ రావ ||నీవు లేక వీణ ||

చిత్రం డాక్టర్ చక్రవర్తి

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |