ఓం నమో శివ రుద్రాయ
ఓం నమో శితి కంఠాయ
ఓం నమో హర నాగాభరణాయ
ప్రణవాయ
ఢమ ఢమ ఢమరుక నాదానందాయ
ఓం నమో నిటలాక్షాయ
ఓం నమో హిమశైలావరణాయ
ప్రమథాయ
ధిమి ధిమి తాండవకేళీలోలాయ
......
సదాశివా సన్యాసీ తాపసీ కైలాసవాసీ
నీ పాదముద్రలు మోసి
పొంగి పోయినాది పల్లె కాశి
హే... సూపుల సుక్కాని దారిగ
సుక్కల తివాసీ మీదిగా
సూడసక్కని సామి దిగినాడురా
ఏసైరా ఊరూవాడా దండోరా
ఏ రంగుల హంగుల పొడలేదురా
ఈడు జంగమ శంకర శివుడేనురా
నిప్పు గొంతున నీలపు మచ్చ సాచ్చిగా
నీ తాపం శాపం తీర్చేవాడేరా
పైపైకలా బైరాగిలా ఉంటాదిరా ఆ లీల
లోకాలనేలేటోడు నీకు
సాయం కాకపోడు
నీలోనే కొలువున్నోడు
నిన్నుదాటి పోనెపోడు
ఓం నమఃశివ జై జై జై... (2)
ఓం నమఃశివ Go to the trance
And say Ogñæ Ogñæ Ogñæ...
Sing along and sing shiva
shambo all the way
ఓం నమః శివ జై జై జై...
Heal the world is all we pray
save our lives and take
Our pain away Ogñæ Ogñæ Ogñæ...
Sing along and sing
shiva shambo all the way
.....
ఎక్కడ వీడుంటే నిండుగా
అక్కడ నేలంతా పండగ
సుట్టు పక్కల సీకటి పెళ్లగించగా
అడుగేశాడంటా కాచే దొరలాగా
మంచును మంటను ఒక్క తీరుగ
లెక్క సెయ్యనే సెయ్యని శంకరయ్యరా
ఉక్కు కంచెగ ఊపిరి నిలిపాడురా
మనకండా దండా వీడే నికరంగా
సామీ అంటే హామీ తనై
ఉంటాడురా చివరంటా
చిత్రం : ఖలేజా (2010)
రచన : రామజోగయ్యశాస్ర్తి
సంగీతం : మణిశర్మ
గానం : రమేష్, కారుణ్య