Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

నేడు సింగీతం శ్రీనివాసరావు బర్త్‌డే, జి.కె.వెంకటేష్ జయంతి(22nd September)

పల్లవి :
పాడనా తెనుగుపాట...
పాడనా తెనుగుపాట
పరవశనై మీ ఎదుట మీ పాట
పాడనా తెనుగుపాట...

చరణం : 1
కోవెల గంటల గణగణలో
గోదావరి తరగల గలగలలో
మావుల తోపుల మూపులపైన
మసలే గాలుల గుసగుసలో
మంచి ముత్యాలపేట
మధురామృతాల తేట
ఒకపాట...

చరణం : 2
త్యాగయ క్షేత్రయ రామదాసులు (2)
తనివితీర వినిపించినది
నాడునాడులు కదిలించేది
వాడవాడలా కరిగించేది
చక్కెర మాటల మూట
చిక్కని తేనెల ఊట
ఒకపాట...

చరణం : 3
ఒళ్లంత వయ్యారి కోక
కళ్ళకు కాటుక రేఖ
మెళ్ళో తాళి కాళ్లకు పారాణి
మెరిసే కుంకుమబొట్టు
ఘల్లు ఘల్లున కడియాలందెలు
అల్లనల్లన నడయాడే
తెలుగుతల్లి పెట్టనికోట
తెలుగునాట ప్రతిచోట
ఒకపాట...

చిత్రం : అమెరికా అమ్మాయి (1976)
(ద ర్శకత్వం : సింగీతం శ్రీనివాసరావు)
రచన : దేవులపల్లి కృష్ణశాస్ర్తి
సంగీతం : జి.కె.వెంకటేష్
గానం : పి.సుశీల

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |