Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

పల్లవి :
ఓం... నమో నారాయణాయ
రాయిని మాత్రం కంటే
దేవుడు కనరాడు
దేవుని మాత్రం కంటే దేహం కనరాదు

హరిని తలచు నా హృదయం
నేడు హరుని తలచుట జరగదులే
అష్ట అక్షరం తెలిసిన నోరు
పంచ అక్షరం పలకదులే
వంకర కన్నుల మీరు శంకర కింకరులు
వైష్ణవునేం చేస్తారు ఆ యమకింకరులు

చరణం : 1
నిలువు నామం దాల్చు తలను
మీకు వంచనులే
నిలువునా నను చీల్చుతున్నా
మాట మార్చనులే
నిలువు నామం దాల్చు తలను
మీకు వంచనులే
నిలువునా నువు చీల్చుతున్నా
మాట మార్చనులే
వీర శైవుల బెదిరింపులకు
పరమ వైష్ణవం ఆగదులే
ప్రభువు ఆనతికి జడిసేనాడు
పడమట సూర్యుడు పొడవడులే
రాజ్యలక్ష్మి నాథుడు శ్రీనివాసుడే
శ్రీనివాసుడి వారసుడీ విష్ణుదాసుడే
దేశాన్నేలే వారంతా రాజ్య దాసులే
రాజులకు రాజు ఈ రంగరాజనే

చరణం : 2
నీటిలోన ముంచినంత నీతి చావదులే
గుండెలోన వెలుగును నింపే
జ్యోతి ఆరదులే
దివ్వెలనార్పే సుడిగాలి
వెన్నెల వెలుగును ఆర్పేనా
నేలను ముంచే జడివాన
ఆకాశాన్నే తడిపేనా
శైవం ఒక్కటి మాత్రం దైవం కాదంట
దైవం కోసం పోరే సమయం లేదంట

చిత్రం : దశావతారం (2008)
రచన : వెన్నెలకంటి
సంగీతం : హిమేష్ రేష్మియా
గానం : హరిహరన్, బృందం

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |