Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

పల్లవి :
సఖియా... చెలియా...
కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పండు
సఖియా... చెలియా...
నీ ఒంపే సొంపే తొణికిన తొలి పండు
పచ్చందనమే పచ్చదనమే
తొలి తొలి వలపే పచ్చదనమే
పచ్చిక నవ్వుల పచ్చదనమే
ఎదకు సమ్మతం చెలిమే (2)
పచ్చందనమే పచ్చదనమే
ఎదిగే పరువం పచ్చదనమే
నీ చిరునవ్వు పచ్చదనమే
ఎదకు సమ్మతం చెలిమే (3)

చరణం : 1
కలికి చిలకమ్మ ఎర్ర ముక్కు
ఎరమ్రుక్కులే పిల్ల వాక్కు
పువ్వై పూసిన ఎర్ర రోజా
పూత గులాబి పసి పాదం
ఎరన్రి రూపం ఉడికే కోపం (2)
సంధ్యావర్ణ మంత్రాలు వింటే
ఎరన్రి పంట పాదమంటే
కాంచనాల జిలుగు పచ్చ
కొండబంతి గోరంత పచ్చ
పచ్చా... పచ్చా... పచ్చా...
మసకే పడితే మరకత వర్ణం
అందం చందం అలిగిన వర్ణం


చరణం : 2
అలలే లేని సాగర వర్ణం
మొయిలే లేని అంబర వర్ణం
మయూర గళమే వర్ణం
గుమ్మాడి పూవు తొలి వర్ణం
ఊదా పూ రెక్కలపై వర్ణం
ఎన్నో చేరేనే కన్నె గగనం
నన్నే చేరే ఈ కన్నె భువనం
చరణం : 3 రాత్రి నలుపే రంగు నలుపే
వానాకాలం మొత్తం నలుపే
కాకి రెక్కల్లో కారునలుపే
కన్నె కాటుక కళ్లు నలుపే
విసిగి పాడే కోయిల నలుపే
నీలాంబరాల కుంతల నలుపే (2)

తెల్లని తెలుపే ఎద తెలిపే
వానలు కడిగిన తుమి తెలిపే ॥
ఇరుకున పాపల కథ తెలిపే
ఉన్న మనసు తెలిపే
ఉడుకు మనసు తెలిపే
ఉరుకు మనసు తెలిపే

చిత్రం : సఖి (2000)
రచన : వేటూరి
సంగీతం : ఎ.ఆర్.రెహమాన్
గానం : హరిహరన్

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |