Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

పల్లవి :
సమయానికి తగుసేవలు
సేయనీ నీ శ్రీవారినీ (2)
ఇన్నాళ్ళుగా శ్రమియించిన ఇల్లాలిని
ఇకసేవించనీ ఈ శ్రీవారినీ

చరణం : 1
నాకు నువ్వు నీకు నేను
అన్న తీపి మాటతో
చెవిలోన గుసగుసల
చిలిపి వలపు పాటతో
శ్రీమతికి జరిగేను సుప్రభాత సేవ
బంగారు నగల మించు
బాహు బంధాలతో
చలువ చందనాల మించు
చల్లని నా చూపుతో
అర్ధాంగికి జరిగేను అలంకార సేవ
అమ్మలోని బుజ్జగింపు
కలిపిన ఈ బువ్వతో
నాన్నలోని ఊరడింపు
తెలిసిన ఈ చేతితో
నా పాపకు జరిగేను నైవేద్యసేవ
నైవేద్యసేవ...

చరణం : 2
కలతలేని లోకంలో దిష్టిపడని దీవిలో
చెడుచేరని చోటులో
ప్రశాంత పర్ణశాలలో
ఈ కాంతకు జరిగేను ఏకాంతసేవ
అనుబంధమె బంధువై
మమతలె ముత్తయిదువలై
ఆనందబాష్పాలె అనుకోని అతిథులై
సీతమ్మకు జరిగేను సీమంతపు సేవ
నులివెచ్చని నా ఎదపై
పరిచేటి పాన్పులో
కనురెప్పల వింజామర
విసిరేటి గాలితో
చూలాలికి జరిగేను జోలాలి సేవ
జోజోలాలి సేవ
శ్రీవారికి ఒక మనవిని సేయనీ
ఈ ప్రియదాసినీ (2)
కనుతెరవగ మీ రూపే చూడాలని...
మీ కౌగిళ్లలో కనుమూయాలని...
ఈ కౌగిళ్లలో కలిసుండాలని...

చిత్రం : సీతయ్య (2000)
రచన : చంద్రబోస్
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
గానం : విజయ్ ఏసుదాస్, సునీత

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |