Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

పల్లవి :
సినుకమ్మ వాన సినుకమ్మ
నేల చిన్నబోయె సూడు బతుకమ్మ
మేఘాల దాగుండి పోకమ్మ
ఆగమేఘాల మీద ను రావమ్మ

కంటి మీద కునుకు లేదమ్మా
పల్లె కన్నీరు బెడుతుంది సూడమ్మ
కరుణించి ఒకసారి రావమ్మ
మా కష్టాలెన్నో తీరునోయమ్మ

ఎండిపోయె రైతు గుండెను ముద్దాడి
కుండపోతగ కురిసిపోవమ్మ

చరణం : 1
అవ్వ తోడు నువ్వు అల్లాడి పోతుంటె
మనసు తల్లడిల్లుతున్నది
మక్కేమొ నెలదప్పి ఎక్కెక్కి ఏడిస్తె
గుండె సెరువై పోతవున్నది

కంది సేను వాడి కళదప్పిపోతుంటె
కష్టమెంతొ కలుగుతున్నది
పెసరు బబ్బెర సేను పసరెండి
పోతుంటె ప్రాణ మాగినట్టుగున్నది

పసిపిల్లలూ తల్లిపాలకేడ్చినట్లు
పునాస సేండ్లన్ని నీళ్లకేడ్వబట్టె

చరణం : 2
పంట సేండ్లె మాకు పంచ ప్రాణా
లంటు సొమ్ములన్ని అమ్ముకుంటిమి
మొక్కమొక్కకు రోజు సెమట సుక్కలు
బోసి కంటిరెప్పల కాపుకుంటిమి

సూర్యూని సుట్టూగ భూమి తిరిగినట్లు
సేండ్ల సుట్టె తిరగవడితిమి
గొడ్డుసాకిరి సేసి గోసలెన్నొ బడ్డ ఆశల్లో
బతికీడబడితిమి
కాలము పగబట్టి కార్తులుపోబట్టె కప్పతల్లాటల్లో మా బతుకుబాటల్లో

చిత్రం : బతుకమ్మ (2008)
రచన : అందెశ్రీ
సంగీతం : టి.ప్రభాకర్
గానం : గాయత్రి, బృందం

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |