తగునా ఇది మామా- తమరే ఇటు బల్క నగున తగునా ఇది మామా
నిగమ మార్గములు తెలిసిన- నీవే ఇటులన జనునా ||తగునా||
అల్లుడనగ నెవడు - మీ అమ్మాయికి మగడు
నీవు కాళ్ళు కడిగి - కన్యాదానము చేసిన ఘనుడు
ఆ ఘనుని మీద అలుక బూన నేటికి - చీటికి మాటికి ||తగునా||
పోపోర పొమ్మికన్ పోపోపో ర పొమ్మికన్నా
గృహమునకు-భోజనమునకు-ఇక రావలదురా తగదు - చీపో పో పో
అరెరే ఎంతటి మోసకాడవుర నాకే టోపీ వేసే
వాడవుర నాకే తోపీ వేసినావునీ సాహసము- పరిహాసము సహింపను-
క్షమించను-యోచించను-నీ మాటన్ వచ్చిన బాటన్- పట్టుము వేగన్ ||తగునా||
కొడుకులు లేనందుకు తల కొరివి భెట్టువాడనే
నీకు కొరివి బెట్టువాడనేనీకు కొరివి బెట్టువాడనే
డైరెక్టుగస్వర్గానికి- చీటి నిచ్చువాడనే
తల్లి లేని పిల్ల ఉసురు తగులదె-వొంటిగ-ఉంచగ ||తగునా||
అరె ఊరికెల్లా మొనగాడినే పెద్ద మిల్లుకెల్ల యజమానినే
నీ డాబుసరి భలే బిత్తిరి నిజమ్మేనని నమ్మితి పోకిరి
దురాత్ముడా! దుష్టాత్ముడా! నీచుడా!
యిపుడు తెలిసెను నీ కథ యెల్లన్. ||తగునా||
చిత్రం: రాముడు భీముడు
రచన: కొసరాజు
సంగీతం: పెండ్యాల
గానం ఘంటసాల, మాధవపెద్ది సత్యం