పల్లవి :
ఆ... ఆ... ఆ...
తళతళా మిలమిలా (2)
పగటిపూట వెన్నెలా... ఆ...
ఎందువలన ఓ లలనా ఎందువలన ఎందువలన ఓ లలనా ఎందువలన
॥
చరణం : 1
చిలకమ్మల కిలకిల చిగురాకుల కలకల
॥
గాలి వీచి పూలు కురిసి
కథలు తెలిపె కోయిల
తెలియరాని ఊహలలో తేలిపోవు వేళ
చిలిపిగా పావురాలు చూసి నవ్వెనేల
॥
చరణం : 2
మురిసిపోవు మనసులోని
మధురభావన
మరుపురాని మరువలేని ఎవరిదీవెన
చిన్ననాటి మా చెలిమి
చిగురించెను నేటికి
మనసు పయనమైనది
మధురమైన చోటుకి
॥
చిత్రం : అన్నపూర్ణ (1960)
రచన : ఆరుద్ర
సంగీతం : సుసర్ల దక్షిణామూర్తి
గానం : పి.సుశీల