Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

వేదంలా ఘొషించే గోదావరి
అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి
వేదంలా ఘొషించే గోదావరి
అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి

శతాబ్దాల చరితగల సుందర నగరం
శతాబ్దాల చరితగల సుందర నగరం
గత వైభవ దీప్తులతొ కమ్మని కావ్యం ||వేదంలా||

రాజరాజ నరేంద్రుడు కాకతీయులు
తేజమున్న మేటిదొరలు రెడ్డిరాజులు
గజపతులు నరపతులు ఎలిన ఊరు
ఆకధలన్ని నినదించే గౌతమి హోరు ||వేదంలా||

శ్రీవాణి గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాన్వేషు
ఏలోకానాం స్తిథి మావహంచ విహితాం స్త్రిపుంసయోగోద్భవాం
తే వేదత్రయ మూర్తాయ స్త్రిపురుషా సంపూజితా వసురైర్భూయాసుహు
పురుషోత్తమాం భుజభవ శ్రీఖంధరాశ్రేయసే

ఆదికవిత నన్నయ వ్రాసెనిచ్చట
శ్రీనాధకవి నివాసము పెద్ద ముచ్చట
ఆదికవిత నన్నయ వ్రాసెనిచ్చట
శృఇనాధకవి నివాసము పెద్ద ముచ్చట
కవి సార్వభౌములకిది ఆలవాలము
కవి సార్వభౌములకిది ఆలవాలము
నవ కవితలు వికసించే నందనవనము ||వేదంలా||

దిట్టమైన శిల్పాల దేవళాలు
కట్టుకధల చిత్రాంగి కనక మేడలు
దిట్టమైన శిల్పాల దేవళాలు
కట్టుకధల చిత్రాంగి కనక మేడలు
కొట్టుకొనిపోయే కొన్ని కోటిలింగాలు
వీరేశలింగమొకడు మిగిలెను చాలు ||వేదంలా||

చిత్రం: ఆంధ్రకేసరి
గీతం: ఆరుద్ర(?)
గాత్రం: బాలు
సంగీతం: రమేష్ నాయుడు

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |