ఏ గువ్వా... ముద్దు గువ్వా...
ఏ గువ్వా... చిట్టిగువ్వా...
ఓ జోడు ఉంటే దాన్ని తోడితెచ్చి
మా పంచలోకి వచ్చి గూడుకట్టు
పోట్లాట ఇల్లు కట్టు బంగారు గూడు
ఇప్పుడిల్లాలు లేదు వచ్చి నాతోటి పాడు
ఏ గువ్వా... చిట్టిగువ్వా...
ఏ గువ్వా... అయ్య అన్నదాంట్లో
ఎంతో అర్థముంది
కాని కొంపలోనే కొంత గోడు ఉంది
పెళ్ళాన్నై వచ్చి నా గూడు చూసి
అద్దివ్వమంటే... అహ్హహ్హా ఏం చేయనయ్యా
ఏ గువ్వా... చిట్టిగువ్వా...
ఏ ఎవరే... అది ఎవరే...
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి
నీదాన్నై ఉన్నానమ్మీ నా తోైడె నువ్వున్నావనీ
గుండెలోనా ఉన్న ఊసు
నా గొంతువిప్పి చెప్పానయ్యా
ఇది వావైన వరసో పసి వయసైన మనసో
నీ తప్పైన కలనా కన్నీటి అలనా
నీదాన్నై ఉన్నానమ్మీ నా తోైడె నువ్వున్నావనీ
గానం : ఎస్.జానకి
నేరేడు తోటంతా ఆ...
నేడే పండింది నేడే పండింది
నోరే ఊరిందమ్మా ఆ... నన్నిపుడే రమ్మందమ్మా
నీలాల కళ్లదాన నా జోడి పిల్లదాన ॥
రుచినే సూడాలంటే...
ఇది పొద్దు కాదంది ఇది ఈ పొద్దు కాదంది
అరె ఎలమావి కొమ్మల్లో...
ఎదురొచ్చి నాతోటి ఎవరన్న పాడేది
పంట భలే పండిందనీ...
పాట ఏదో పాడానే పాట ఏదో పాడానే
పాట సద్దు విన్నావటే పాట సద్దూ విన్నావటే
పాటసద్దూ విన్నావటే
పాట సద్దు విన్నానయ్యా
నీ పాట సద్దు విన్నానయ్యా
కూ అంటే కో అన్నాను
కోకిలమ్మనయ్యాను కోకిలమ్మనయ్యాను
ఏ... ఇలనట్టే ఊరించకే
నా సత్తా చూస్తావులే నీ ఆట నే కట్టిస్తాను
పంతానికి వచ్చావంటే ఓడిస్తాను పందెమెంతా ఓడిస్తాను పందెమెంతా
వయసున్న వాణ్ణే నేను
నువ్వే ఓడిపోతావు
అహ నువ్వే ఓడి... అహ నువ్వే ఓడి...
చిత్రం : ఆత్మబంధువు (1985)
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : ఇళయరాజా
గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి