Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |

సాకీ :
ఏడవకు ఏడవకు వెర్రినాగన్నా...
ఏడుస్తే నీ కళ్లు నీలాలు కారూ..
జోజో జోజో... జోజో జోజో...
పల్లవి :
ఎదగడానికెందుకురా తొందరా
ఎదర బతుకంతా చిందర వందర ॥
జోజో జోజో... జోజో జోజో...

చరణం : 1
ఎదిగేవో బడిలోను ఎన్నెన్నో చదవాలి
పనికిరాని పాఠాలు బట్టీయం పెట్టాలి
చదవకుంటే పరీక్షలో కాపీలు కొట్టాలి
పట్టుబడితె ఫెయిలైతే బిక్కమొహం వెయ్యాలి
కాలేజీ సీట్లు అగచాట్లురా
అవి కొనడానికి ఉండాలి నోట్లురా
చదువు పూర్తయితే మొదలవ్వును పాట్లురా
అందుకే... ॥

చరణం : 2
ఉద్యోగం వేటలోన ఊరంతా తిరగాలి
అడ్డమైనవాళ్లకీ గుడ్‌మార్నింగ్ కొట్టాలి
ఆమ్యామ్యా అర్పించి హస్తాలు తడపాలి
ఇంటర్‌వ్యూ అంటూ క్యూ అంటూ
పొద్దంతా నిలవాలి
పిలుపు రాకుంటే నీ ఆశ వేస్టురా
మళ్లా పెట్టాలి ఇంకో దరఖాస్తురా
ఎండమావి నీకెపుడూ దోస్తురా
అందుకే... ॥

చరణం : 3
బిఏను చదివి చిన్న బంట్రోతు పనికెళితే
ఎంఏలు అచట ముందు సిద్ధము
నీవు చేయలేవు వాళ్లతో యుద్ధము
బతకలేక బడిపంతులు పని నువ్వు చేసేవో
పదినెల్లదాకా జీతమివ్వరు
నువ్వు బతికావో చచ్చేవో చూడరు
ఈ సంఘంలో ఎదగడమే దండగా
మంచి కాలమొకటి వస్తుంది నిండుగా
అపుడు ఎదగడమే బాలలకు పండగా
అందాకా... ॥
జోజో జోజో... జోజో జోజో...
టాటా టాటా... టాటా టాటా...

చిత్రం : అందాల రాముడు (1973)
రచన : ఆరుద్ర
సంగీతం : కె.వి.మహదేవన్
గానం : వి.రామకృష్ణ

0 Comments:

Post a Comment



Learn English Vocabulary & Help the POOR | Eng Vocab| Link 1 |